
పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ చరిత్రపుటల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్‌లో 400 వికెట్లు తీసిన రెండో పాక్ బౌలర్‌గా అవతరించాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు.
ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న ఆమిర్ (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్).. ఇవాళ (ఆగస్ట్ 21) ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని తాకాడు. ఆమిర్‌కు ముందు పాక్ తరఫున వాహబ్ రియాజ్ ఈ ఘనత సాధించాడు.
రియాజ్ 2005 నుంచి 2023 మధ్యలో 348 టీ20లు ఆడి 413 వికెట్లు సాధించగా.. ఆమిర్ 2008 నుంచి ఈ ఫార్మాట్‌లో కొనసాగుతూ 343 మ్యాచ్‌ల్లో 400 వికెట్లు తీశాడు.
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రషీద్ ఖాన్ (658), డ్వేన్ బ్రావో (631), సునీల్ నరైన్ (590), ఇమ్రాన్ తాహిర్ (549), షకీబ్ అల్ హసన్ (499), ఆండ్రీ రసెల్ (485), క్రిస్ జోర్డన్ (438), వాహబ్ రియాజ్ (413) ఆమిర్ కంటే ముందున్నారు.
33 ఏళ్ల ఆమిర్ 2021లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఆతర్వాత మనసు మార్చుకున్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు తిరిగి అతడు పాకిస్తాన్ జట్టులో చేరాడు. ఆ టోర్నీ అనంతరం మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
అప్పటి నుంచి ఐపీఎల్ మినహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఆమిర్ ఇటీవల ఐపీఎల్ ఆడాలనే కల ఉందని చెప్పాడు. అవకాశం వస్తే ఆర్సీబీకి ఆడతానని అన్నాడు. ఆమిర్ ప్రస్తుతం బ్రిటన్ పౌరసత్వం పొంది ఐపీఎల్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కాగా, పాక్ ఆటగాళ్లపై ఐపీఎల్‌లో నిషేధం ఉన్న విషయం తెలిసిందే.
ఆమిర్ పాక్ తరఫున 36 టెస్ట్‌లోల 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 62 టీ20ల్లో 71 వికెట్లు తీశాడు. పాక్ తరఫున ఆమిర్ కెరీర్ వివాదాల మయంగా ఉంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అతను ఐదేళ్లు (2010-15) నిషేధం ఎదుర్కొన్నాడు.