breaking news
Mohammed Aamir
-
చరిత్రపుటల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ చరిత్రపుటల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్లో 400 వికెట్లు తీసిన రెండో పాక్ బౌలర్‌గా అవతరించాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు.ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న ఆమిర్ (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్).. ఇవాళ (ఆగస్ట్ 21) ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని తాకాడు. ఆమిర్‌కు ముందు పాక్ తరఫున వాహబ్ రియాజ్ ఈ ఘనత సాధించాడు. రియాజ్ 2005 నుంచి 2023 మధ్యలో 348 టీ20లు ఆడి 413 వికెట్లు సాధించగా.. ఆమిర్ 2008 నుంచి ఈ ఫార్మాట్లో కొనసాగుతూ 343 మ్యాచ్‌ల్లో 400 వికెట్లు తీశాడు.పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రషీద్ ఖాన్ (658), డ్వేన్ బ్రావో (631), సునీల్ నరైన్ (590), ఇమ్రాన్ తాహిర్ (549), షకీబ్ అల్ హసన్ (499), ఆండ్రీ రసెల్ (485), క్రిస్ జోర్డన్ (438), వాహబ్ రియాజ్ (413) ఆమిర్ కంటే ముందున్నారు.33 ఏళ్ల ఆమిర్ 2021లోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఆతర్వాత మనసు మార్చుకున్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు తిరిగి అతడు పాకిస్తాన్ జట్టులో చేరాడు. ఆ టోర్నీ అనంతరం మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అప్పటి నుంచి ఐపీఎల్ మినహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఆమిర్ ఇటీవల ఐపీఎల్ ఆడాలనే కల ఉందని చెప్పాడు. అవకాశం వస్తే ఆర్సీబీకి ఆడతానని అన్నాడు. ఆమిర్ ప్రస్తుతం బ్రిటన్ పౌరసత్వం పొంది ఐపీఎల్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కాగా, పాక్ ఆటగాళ్లపై ఐపీఎల్లో నిషేధం ఉన్న విషయం తెలిసిందే.ఆమిర్ పాక్ తరఫున 36 టెస్ట్లోల 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 62 టీ20ల్లో 71 వికెట్లు తీశాడు. పాక్ తరఫున ఆమిర్ కెరీర్ వివాదాల మయంగా ఉంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అతను ఐదేళ్లు (2010-15) నిషేధం ఎదుర్కొన్నాడు. -
హైకోర్టు ఆదేశాలు.. పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు సాహిల్
సాక్షి,హైదరాబాద్: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఇవాళ (సోమవారం) పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సాహెల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 2023 డిసెబర్ 23న (శనివారం) హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు సాహిల్. శనివారం అర్ధరాత్రి దాటాక మితిమీరిన వేగంతో కారు నడిపిన సాహిల్ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టారు.కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో ప్రజాభవన్ ఘటన అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు సాహిల్ తొలుత ముంబైకి, అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు గుర్తించారు.దీంతో అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. దుబాయి నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఈ ఏడాది డిసెంబర్ 4న కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ఎదుట సాహిల్ హాజరు కావాలని సూచించింది. దుబాయ్‌లో ఉన్న విచారణలో భాగంగా సాహిల్ దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో సాహిల్ ఇవాళ పంజాగుట్ట పోలీసుల విచారణను ఎదుర్కొనున్నారు. -
ఆమిర్‌పై వేటు
కరాచీ: కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న పాకిస్తాన్ యువ పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇంగ్లండ్‌లో మే 30 నుంచి జూలై 14 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగే 15 మంది సభ్యులుగల పాకిస్తాన్ జట్టును చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ గురువారం ప్రకటించారు. ఆమిర్‌తోపాటు బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీలను రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. ఎవరైనా గాయపడితే వీరికి అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్‌లో జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ సాధించిన పాకిస్తాన్ బృందంలోని 11 మంది ప్రపంచకప్‌కు వెళ్తున్నారని ఇంజమామ్ అన్నారు. ఆమిర్ ఆడిన గత 14 వన్డేల్లో కేవలం ఐదు వికెట్లు తీశాడు. సీనియర్ సభ్యులు షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్‌లు కూడా తమ స్థానాలను కాపాడుకున్నారు. పూర్తి ఫిట్‌గా ఉంటేనే హఫీజ్‌ను ఇంగ్లండ్‌కు పంపిస్తామని ఇంజమామ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, ఆబిద్ అలీ, బాబర్ ఆజమ్, షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీమ్, హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ ఆఫ్రిది, జునైద్ ఖాన్, మొహమ్మద్ హస్నయిన్. -
వెస్టిండీస్ 286 ఆలౌట్
కింగ్స్టన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 278/9తో మూడో రోజు ఆట కొనసాగించిన వెస్టిండీస్ మరో ఎనిమిది పరుగులు జోడించి ఆలౌటైంది. విండీస్ జట్టులో రోస్టన్ చేజ్ (63; 7 ఫోర్లు, ఒక సిక్స్), డౌరిచ్ (56; 9 ఫోర్లు), హోల్డర్ (57 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. పాక్ పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ 44 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం విశేషం. కడపటి వార్తలు అందే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.