ఆమిర్‌పై వేటు

Pakistan Fast bowler left out of World Cup provisional squad - Sakshi

ప్రపంచకప్‌కు పాక్‌ జట్టు ఎంపిక

కరాచీ: కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న పాకిస్తాన్‌ యువ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్‌ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇంగ్లండ్‌లో మే 30 నుంచి జూలై 14 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగే 15 మంది సభ్యులుగల పాకిస్తాన్‌ జట్టును చీఫ్‌ సెలెక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ గురువారం ప్రకటించారు. ఆమిర్‌తోపాటు బ్యాట్స్‌మన్‌ ఆసిఫ్‌ అలీలను రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. ఎవరైనా గాయపడితే వీరికి అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్‌లో జరిగిన 2017 చాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన పాకిస్తాన్‌ బృందంలోని 11 మంది ప్రపంచకప్‌కు వెళ్తున్నారని ఇంజమామ్‌ అన్నారు. ఆమిర్‌ ఆడిన గత 14 వన్డేల్లో కేవలం ఐదు వికెట్లు తీశాడు. సీనియర్‌ సభ్యులు షోయబ్‌ మాలిక్, మొహమ్మద్‌ హఫీజ్‌లు కూడా తమ స్థానాలను కాపాడుకున్నారు. పూర్తి ఫిట్‌గా ఉంటేనే హఫీజ్‌ను ఇంగ్లండ్‌కు పంపిస్తామని ఇంజమామ్‌ స్పష్టం చేశారు.  

పాకిస్తాన్‌ జట్టు: సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్, వికెట్‌ కీపర్‌), ఫఖర్‌ జమాన్, ఇమామ్‌ ఉల్‌ హక్, ఆబిద్‌ అలీ, బాబర్‌ ఆజమ్, షోయబ్‌ మాలిక్, మొహమ్మద్‌ హఫీజ్, షాదాబ్‌ ఖాన్, ఇమాద్‌ వసీమ్, హసన్‌ అలీ, ఫహీమ్‌ అష్రఫ్, షాహీన్‌ ఆఫ్రిది, జునైద్‌ ఖాన్, మొహమ్మద్‌ హస్నయిన్‌. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top