ఆయన అడియాలా జైలులోనే ఉన్నారు
ప్రకటించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్
లాహోర్: మాజీ క్రికెటర్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(73) కస్టడీలో చనిపోయారంటూ వస్తున్న వార్తలు, అడియాలా జైలు వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. జైలులోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని గురువారం ప్రకటించింది. ఇమ్రాన్‌ను ఎక్కడికీ తరలించలేదని, జైలులోనే పూర్తి స్థాయిలో అవసరమైన వైద్య సాయం అందుతోందని పేర్కొంది.
‘తీవ్ర అనారో గ్యంతో ఉన్న ఇమ్రాన్‌ను అడియాలా జైలు నుంచి ఆస్పత్రికి తరలించామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు’అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత కూడా అయిన ఇమ్రాన్ ఖాన్ వివిధ అవినీతి ఆరోపణలు, ఉగ్రవాదం కేసుల్లో 2023 ఆగస్ట్ నుంచి, జైలు జీవితం గడుపుతుండటం తెల్సిందే.


