PC: BCCI/X
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన రీఎంట్రీలో తీవ్ర నిరాశపరిచాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భువీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కివీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్.. ఆ తర్వాత మాత్రం పూర్తి తేలిపోయాడు.
ఈ యూపీ పేసర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 49 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇది భువనేశ్వర్ నమెదు చేసిన రెండో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం. అంతకుముందు 2022లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ ఒక్క వికెట్ పడగొట్టకుండా 52 పరుగులిచ్చాడు.
ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్) టాస్ స్కోరర్‌గా నిలవగా.. ఫిన్ అలెన్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెవాన్ జాకబ్స్ (16 బంతుల్లో 31) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
చదవండి: IND vs NZ: గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం.. టీమిండియా టార్గెట్ 226 పరుగులు


