గ్లెన్‌ ఫిలిప్స్‌ విధ్వంసం.. టీమిండియా టార్గెట్‌ 226 పరుగులు | IND vs NZ: Glenn Phillips Masterclass Propels New Zealand to 225-4 in Christchurch | Sakshi
Sakshi News home page

IND vs NZ: గ్లెన్‌ ఫిలిప్స్‌ విధ్వంసం.. టీమిండియా టార్గెట్‌ 226 పరుగులు

Oct 22 2026 2:36 PM | Updated on Oct 22 2026 2:59 PM

IND vs NZ: Glenn Phillips Masterclass Propels New Zealand to 225-4 in Christchurch

PC: X

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.  న్యూజిలాండ్‌కు ఎప్పటిలాగే ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌ (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), టిమ్‌ సీఫర్ట్‌ (24) శుభారంభం అందించారు.

ఆ తర్వాత మిడిలార్డర్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్‌), బెవాన్‌ జాకబ్స్‌ (16 బంతుల్లో 31) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ముఖ్యంగా గ్లెన్‌ ఫిలిప్స్‌ మైదానం నలుమూలలా బౌండరీల బాదుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడిని ఔట్‌ చేయడం బౌలర్లకు ఎవరికీ సాధ్యం కాలేదు.

బౌలర్ల వైఫల్యం
భారత బౌలర్లలో ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నాలుగేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో భువీ 49 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌  సాధించలేకపోయాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌, మయాంక్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.
చదవండి: రీఎంట్రీలో వరల్డ్‌ రికార్డు నెలకొల్పిన భువనేశ్వర్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement