వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం | TDP leaders attack on YSRCP workers | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం

Sep 22 2026 4:49 AM | Updated on Sep 22 2026 4:49 AM

TDP leaders attack on YSRCP workers

దాడి చేసిన టీడీపీ నేత జేసీ అనుచరులు

కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు బరితెగిస్తున్నారు. సోమవారం తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త బెస్త వెంకటేశులుపై వేటకొడవళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శ్రీ సత్య­సాయి జిల్లా చెన్నేకొత్తపల్లి వద్ద చోటుచేసుకుంది. 

బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వరదాయపల్లి మాజీ సర్పంచ్‌ వెంకటరాముడు కుమారుడు బెస్త వెంకటేశులు చెన్నేకొత్తపల్లిలో కౌలుకు తీసుకుని అరటి తోట సాగు చేస్తున్నాడు. జేసీ వర్గీయులతో ఉన్న రాజకీయ తగాదాల కారణంగా కొంత కాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. వెంకటేశులు చెన్నేకొత్తపల్లి సమీపంలోని టీ స్టాల్‌ వద్ద ఒంటరిగా ఉండగా, ముసుగులు ధరించి వచ్చిన ఐదుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేశారు. కాలు, తలపై నరికారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశులును 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తీసుకెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement