పీఎండీఎస్‌తో రైతుకు భరోసా | - | Sakshi
Sakshi News home page

పీఎండీఎస్‌తో రైతుకు భరోసా

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

గార్లదిన్నె: ఎన్‌నినో పరిస్థితుల వల్ల తక్కువ వర్షపాతం ఉండడంతో పీఎండీఎస్‌ (ప్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌) విధానంలో పంటలు సాగు చేస్తే రైతులకు భరోసా లభిస్తుందని ఏపీసీఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం గార్లదిన్నె మండల పరిధిలోని కోటంకలో 70 ఎకరాల్లో చేపట్టిన పీఎండీఎస్‌ సిట్రస్‌, కాంపాక్ట్‌ బ్లాక్‌ను విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆనంద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ భూమిలో తేమను కాపాడుకుంటూ పంటల వైవిధ్యంతో రైతులు సాగును కొనసాగించాలన్నారు. మిశ్రమ పంటలు సాగు చేయడం వల్ల నేల సారవంతం పెరిగి, కలుపు ఉధృతి తగ్గి రైతుకు ఆదాయం వస్తుందన్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షంకు రైతులు ఉలవ, కొర్ర, జొన్న విత్తనాలు వంటి ప్రత్యామ్నాయ పంటలు విత్తుకోవాలన్నారు. అనంతరం 4 ఎకరాల్లో కాంపాక్ట్‌ బ్లాక్‌లో పెల్లైటెజ్డ్‌, పీఎండీఎస్‌ విత్తన గుళికలతో విత్తనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సాలు రెడ్డి, జిల్లా మేనేజర్‌ లక్ష్మానాయక్‌, ఎస్పీం డాక్టర్‌, నవీన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ వెంకట్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారి సోమశేఖర్‌, ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్‌ పాల్గొన్నారు.

లాభదాయకంగా పెల్లైటెజ్డ్‌ పీఎండీఎస్‌

కూడేరు: ‘ప్రకృతి వ్యవసాయంలో వర్షాకాలానికి ముందే పొడి నేలలో విత్తనాలు విత్తే విధానమే పీఎండీఎస్‌. ఎల్‌–నినో పరిస్థితులను అధిగమించడానికి ఇది వినూత్న విధానం. ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది’ అని ఏపీసీఎన్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయకుమార్‌ అన్నారు. కూడేరులో ఒకే చోట 30 ఎకరాల్లో పెల్లైటెజ్డ్‌ పీఎండీఎస్‌ విధానంలో చేపడుతున్న పంటలను సోమవారం ఆయన కలెక్టర్‌ ఆనంద్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement