బాధితులకు సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయం

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

అనంతపురం సెంట్రల్‌: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని ఎస్పీ జగదీష్‌ ఆదేశించారు. సోమవారం పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 129 అర్జీలు నమోదయ్యాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడి.. సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాకు నూతన మొబైల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌ వాహనం

నేర స్థలాల్లో ఆధారాలు సేకరించేందుకు మొబైల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌ను జిల్లాకు మంజూరు చేశారు. సోమవారం పోలీసు కార్యాలయ ఆవరణంలో ఎస్పీ జగదీష్‌ వాహనాన్ని పరిశీలించారు. ఫొటోగ్రఫీ, వీడియో డాక్యుమెంటేషన్‌, శాసీ్త్రయ పద్ధతుల్లో ఆధారాల సేకరణ చేపట్టేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

లైన్‌మెన్‌పై వేటు

ఏఈ ప్రతాప్‌కు షోకాజ్‌

అనంతపురం టౌన్‌: బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు గ్రామంలో శనివారం చోటు చేసుకున్న విద్యుత్‌ ప్రమాదంలో జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు ప్రధాన్‌ భందర, నానో బాణరలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విద్యుత్‌ ప్రమాదంలో రేగడి కొత్తూరు లైన్‌మెన్‌ వెంకటేష్‌ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించారు. రేగడికొత్తూరు లైన్‌ ఎల్‌సీ తీసుకోకుండా వడియంపేట లైన్‌కు ఎల్‌సీ తీసుకొని ఇద్దరు కార్మికుల మృతికి కారణం కావడంతో వెంకటేష్‌ను సస్పెండ్‌ చేసినట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. బీకేఎస్‌ విద్యుత్‌ శాఖ ఏఈ ప్రతాప్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ప్రమాదంపై లోతుగా విచారణ చేపట్టేందుకు విజిలెన్సు డీఈని విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

23న జాబ్‌ మేళా

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 23న జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. అనంతపురం, పరిసర ప్రాంతాలకు చెందిన ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువతతో పాటు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పలు ప్రముఖ సంస్థలు మేళాలో పాల్గొని అర్హతలను బట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. విద్యార్హత, వయసు, ఉద్యోగ స్వభావం, సంస్థను బట్టి వేతనాలు, ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు ఉంటాయని ప్రిన్సిపల్‌ పద్మశ్రీ, జేకేసీ కోఆర్డినేటర్‌ జీవన్‌కుమార్‌ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటాతో పాటు విద్యార్హతల ధ్రువపత్రాలు, అవసరమైన ఇతర పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దివ్యాంగులంటే చులకనా?

అనంతపురం అర్బన్‌: ‘దివ్యాంగులంటే మీకంత చులకనా..? టీడీపీ నాయకులు చెప్పినోళ్లకే పింఛను ఇస్తారు. వారి చెప్పనది దరఖాస్తులు కూడా తీసుకోరా..?’ అంటూ దివ్యాంగుల సంఘం నాయకుడు రాజేష్‌ ధ్వజమెత్తారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అర్హులకు పింఛన్లు ఇవ్వరంట... దరఖాస్తులు తీసుకోరంటూ మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులను ఎమ్మెల్యే పిలిపించుకుని... మా నాయకులు చెప్పిన వారికే దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారన్నారు. బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామానికి చెందిన శివన్న తన ఆరేళ్ల కుమార్తె దివ్యాంగురాలు మోక్షిత పింఛను కోసం 12వ తేదీన దరఖాస్తు చేస్తే డిజిటల్‌ అసిస్టెంట్‌ 18వ తేదీ వరకు అప్‌లోడ్‌ చేయకుండా గడువు ముగిసిందని చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడు చిన్నారి మోక్షితకు ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛను ఇస్తారా..? లేక ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌ ఇస్తారా..? అంటూ నిలదీశారు. అర్హులకు పింఛను రాకపోతే కలెక్టరేట్‌ను ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వసంత్‌, హరినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మద్యం షాపుల

రెన్యువల్‌ గడువు పెంపు

అనంతపురం సెంట్రల్‌: మద్యం షాపుల రెన్యువల్‌ గడువును ఈ నెల 23 వరకూ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి బి. రామమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మద్యం షాపులు ప్రస్తుతమున్న లైసెన్స్‌ ఫీజుపై 38 శాతం అదనంగా చెల్లించి రెన్యువల్‌ చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలుత సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ సమయం కేటాయించగా ప్రస్తుతం ఈనెల 23 వరకూ గడువు పెంచినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement