ఆధిపత్య పోరులోనే చరణ్‌ హత్య | - | Sakshi
Sakshi News home page

ఆధిపత్య పోరులోనే చరణ్‌ హత్య

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

గుంతకల్లుటౌన్‌: ట్రాన్స్‌జెండర్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే జగన్‌ అలియాస్‌ చరణ్‌ హత్యకు ప్రధాన కారణమని వన్‌టౌన్‌ సీఐ మనోహర్‌ తెలిపారు. ఈ హత్య కేసులో 9 మందిని సోమవారం మధ్యాహ్నం స్థానిక రైల్వే డీజిల్‌షెడ్‌ రోడ్‌లోని పార్క్‌ వద్ద అరెస్ట్‌ చేశామన్నారు. నిందితుల నుంచి రెండు వేటకొడవళ్లు, ఒక పిడిబాకు, 6 మోటార్‌ సైకిళ్లు, 4 మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. వన్‌టౌన్‌ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను సీఐ వెల్లడించారు.

హత్యకు దారి తీసిన కారణాలేమంటే..

పాతగుంతకల్లు వాల్మీకి సర్కిల్‌ ఏరియాలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే ఏరియాకు చెందిన చిత్ర (హిజ్రా) అలియాస్‌ ఉడదాల పృథ్వీ చేత బెంచికొట్టాలకు చెందిన బోయ వీరేష్‌, అతని స్నేహితులు రిబ్బన్‌ కటింగ్‌ చేయించి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. తన క్రేజ్‌ను తగ్గించారని మనస్తాపానికి గురైన అపర్ణ (హిజ్రా) అలియాస్‌ రాజశేఖర్‌ చిత్రతో చనువుగా ఉంటున్న వీరేష్‌ను ఎలాగైనా చంపాలని భావించింది. 15వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో అపర్ణ వర్గానికి చెందిన సాయివికాస్‌, అతని స్నేహితులు వసంత్‌, సాల్మన్‌రాజ్‌, సుందర్‌లు బెంచికొట్టాలలోని వీరేష్‌ ఇంటి వద్దకు బైక్‌లతో వెళ్లి హారన్‌లు మోగించి భారీ శబ్ధాలను చేశారు. దీంతో వీరేష్‌, అతని స్నేహితులు కలిసి సాయివికాస్‌ అతని మిత్రులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న అపర్ణ వీరేష్‌ను చంపాలని ప్రణాళిక రచించారు. మరుసటి రోజు 16వ తేదీ వేకువజామున తన వర్గీయులైన సాయివికాస్‌, అతని బంధువులతో కలిసి వీరేష్‌ ఇంటిపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో తన అన్న వీరేష్‌ను కాపాడేందుకు వచ్చిన తమ్ముడు చరణ్‌ను వేటకొడవలితో మెడపై బలంగా నరికి, ఛాతీపై కత్తితో పొడవడంతో చరణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులైన ఇందిరానగర్‌కు చెందిన డి.రాజా, రామాంజినేయులు, అల్లీపీరా కాలనీకి చెందిన సాయిచరణ్‌, మధువరణ్‌, మస్తాన్‌పేటకు చెందిన వసంత్‌కుమార్‌, సాల్మన్‌రాజ్‌, బోయ సుందర్‌, రామిరెడ్డికాలనీకి చెందిన షేక్‌నాసిర్‌, దోనిముక్కలరోడ్డుకు చెందిన అపర్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమావేశంలో ఎస్‌ఐ కళ్యాణ్‌, ఏఎస్‌ఐ వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

హత్య కేసులో 9 మంది అరెస్ట్‌

వేటకొడవళ్లు, ఆరు బైక్‌ల స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement