కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వైసీపీ నేతల విడుదల | YSRCP Leaders Released on Section 41 Notices Following Vijayawada DSC Protests | Sakshi
Sakshi News home page

కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వైసీపీ నేతల విడుదల

Sep 21 2026 11:24 PM | Updated on Sep 21 2026 11:27 PM

 YSRCP Leaders Released on Section 41 Notices Following Vijayawada DSC Protests

విజయవాడ: కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వైసీపీ నేతలు విడుదలయ్యారు. 41 నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేశారని తెలిపారు.

‘‘అక్రమంగా 17 మందిని అరెస్ట్ చేశారు. ఉదయం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్టేషన్‌లో ఉంచారు. అక్రమ కేసులు పెట్టారు. నారా లోకేశ్‌కు చిత్తశుద్ధి లేదు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వైరీ వేయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే...144 సెక్షన్ పెడుతున్నారు. శాప్ కార్యాలయం వద్ద టీడీపీ గూండాలను పెట్టారు. వైసీపీ కార్యకర్తల మీద దాడి చేశారు. కార్యకర్తలను రక్తం వచ్చేలా కొట్టారు. కూటమి ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ వేసేందుకు వరకూ ఉద్యమం తీవ్రత చేస్తాం. అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తాం. పోరాటం చేసి అరెస్ట్ అయిన 17 మందికి సెల్యూట్ తెలుపుతున్నాం’’ అని చెప్పారు.

వైసీపీ  లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు జరుగుతున్నాయి. డీఎస్సీపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి. టీడీపీ గూండాలు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. అక్రమ కేసులు పెట్టడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయింది. ఆ పార్టీకి ఉన్న మీడియాతో విష ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీడియా ముసుగులో బతుకుతోంది’’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement