విజయవాడ: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తమ పార్టీకి చెందిన శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే టీడీపీ శ్రేణులు దాడులు చేశాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తారు. పోలీసులతో కలిసి టీడీపీ గూండాలు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అరెస్టు చేసిన తమ నేతను విడుదల చేయాలని.. కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద.. వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు సురేష్. దీనిలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. స్సోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నందిగం సురేష్ డిమాండ్ చేశారు. తమ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే నిరసన తెలియజేయకుండానే, అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించిన వారి గొంతు నొక్కటం దాడులు చేయించడం మంచిది పద్ధతి కాదన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయం గుర్తించుకుంటే మంచిదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం బరితెగింపు


