విశాఖ : ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనబడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్న కారణంగా ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త బలపడి రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బలపడుతున్న అల్పపీడనం.. 23వ తేదీ నాటికి ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ ఒడిస్సా తీరానికి దగ్గరవుతుందని, దాంతో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ఐదు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని, గరిష్టంగా 70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
దీని ప్రభావంతో రేపటి నుంచి(మంగళవారం, సెప్టెంబర్ 23వ తేదీ) నుంచి కోస్తా జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 23, 24వ తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, వైఎస్సార్ కడప, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఈరోజు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఇదీ చదవండి: AP: డీజేలకు అనుమతి ఇచ్చేయండి అనిత గారు!


