సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో పోలీసులు దౌర్జన్యం నానాటికీ పెరిగిపోతుంది. విజయవాడ శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను ఈ రోజు (సోమవారం) పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దీంతో పోలీసులు తీరుపై వైఎస్సార్సీపీ మండిపడింది. నేతలను తక్షణమే విడుదల చేయాలని ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మచిలీపట్నం ఇంఛార్జ్.. వేర్నికిట్టు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంగ సందీప్ లతో పాటు మరి కొంతమంది నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. వారిని నాలుగు గంటలుగా కృష్ణలంక పీఎస్‌లో నిర్భందించారు. దీంతో వైఎస్సార్సీపీ ఈ నేతలు ఈ అక్రమ నిర్భందాన్ని ఖండించారు.
వైఎస్సార్సీపీ నేతల అరెస్టుపై మాజీ ఎంపీ నందిగాం సురేష్ మండిపడ్డారు. అరెస్టు చేసిన తమ నేతలను వెంటనే విడుదల చేయాలని కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే నిరసన తెలియజేయకుండానే.. అరెస్టులు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిరనసలో టీడీపీ గుండాలు పోలీసులతో కలిసి దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారి గొంతు నొక్కటం దాడులు చేయించడం మంచిది పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


