పెన్షన్‌ కోసం పవన్ కాన్వాయ్ వెంబడి పరుగెత్తిన అంధురాలు | Blind Woman Runs After Pawan Kalyan Convoy for Pension | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ కోసం పవన్ కాన్వాయ్ వెంబడి పరుగెత్తిన అంధురాలు

Sep 21 2026 5:19 PM | Updated on Sep 21 2026 5:47 PM

Blind Woman Runs After Pawan Kalyan Convoy for Pension

సాక్షి,కాకినాడ: జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన కష్టాలు చెప్పుకుని, నిలిచిపోయిన పెన్షన్‌ ఇప్పించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నించిన ఓ అంధురాలికి తీవ్ర నిరాశ ఎదురైంది. పవన్ కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఆ తండ్రీ కూతుళ్ల వేదన అందరినీ కలచివేసింది.

పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువుకు చెందిన మఠం జ్యోతి అనే అంధురాలికి కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో ఆమె వికలాంగ పింఛన్ నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించాలని కోరుతూ వస్తోంది. ఆమె జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని, పలువురు ముఖ్య నేతలను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.

ఈ క్రమంలోనే పవన్‌కు తన గోడువెళ్లబోసుకోవాలనే ఆశతో.. జ్యోతి తన తండ్రి వెంకటరమణను వెంటబెట్టుకుని ఎఫ్‌కే పాలెం వద్దకు చేరుకున్నారు. పవన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో తన తండ్రి సాయంతో ఆ అంధురాలు వాహనం వెంబడి పరుగెత్తింది. అయితే పవన్‌ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి, ఆ అంధురాలికి పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement