అడ్వాన్స్‌ తీసుకుని భూమి మరొకరికి అమ్మితే చీటింగేనా? | Real Estate Land Deal Cheating Case Anticipatory Bail | Sakshi
Sakshi News home page

ఒప్పందం కుదుర్చుకున్నా.. అది క్రిమినల్‌ కేసు కాకుండా పోదు!

Sep 30 2026 8:28 AM | Updated on Sep 30 2026 8:28 AM

Real Estate Land Deal Cheating Case Anticipatory Bail

లీగల్‌

నాది ఒక రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీ. ఒక భూమి విషయంలో అడ్వాన్స్‌ తీసుకున్నాను. మూడు నెలల గడువులోగా నా కస్టమర్‌ భూమి కొనుక్కోవాలి. మూడు నెలల పది రోజులు దాటిన తర్వాత మంచి ధర రావడంతో మరొకరికి అదే భూమిని అమ్మేశాను. నా కస్టమర్‌ డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగారు కానీ వ్యక్తిగత ఇబ్బందుల వలన ఇవ్వలేకపోయాను.

దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నామీద చీటింగ్‌ కేసు నమోదయింది. ఇంత ఆలస్యంగా కేసు వేస్తే నిలబడుతుందా? ఇది సివిల్‌ కేసు కదా ఎందుకు ఎఫ్‌.ఐ.ఆర్‌ చేశారు అని పోలీసులని అడిగితే నువ్వు చేసింది చీటింగ్‌ అంటున్నారు. వెంటనే 20% డబ్బు తిరిగి ఇచ్చేశాను. మిగతావి ఇస్తే కేసు వాపసు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఈలోగా అరెస్టు చేస్తారేమో అని భయంగా ఉంది. అరెస్టు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
– మాధవ రావు, వికారాబాద్‌

       ఒకరికి మాట ఇచ్చి, అడ్వాన్స్‌ కూడా తీసుకుని మరొకరికి భూమి అమ్మడం అంటే అది మోసగించడమే! ముందుగా మీరు చేసిందే తప్పు అంటే ఇప్పుడు చేసిన తప్పుని ఎలా సమర్థించుకోవాలి... ఎలా బయటపడాలి... ఎలా అరెస్టు కాకుండా ఉండాలా అని చూస్తున్నారే తప్ప – చేసిన తప్పును ఎలా సరిదిద్దుకోవాలా అని చూడడం లేదు. కావాలని చేయలేదు, వ్యక్తిగత ఇబ్బందుల వల్ల డబ్బులు ఇవ్వలేకపోయాను అని అన్నారు.

మీరు ఏ కారణం చేతయినా డబ్బులు తిరిగి ఇవ్వలేకపోతే అందుకు మీరు తీసుకున్న జాగ్రత్త చర్యలు ఏమిటి... అన్న విషయాన్ని కోర్టు పరిగణిస్తుంది. మీరు 20 శాతం తిరిగి ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన క్రిమినల్‌ కేసు లేకుండా పోదు. అయితే అలా ఒప్పందం కుదుర్చుకుంటే మీకు ముందస్తు బెయిలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇది సివిల్‌ కేసు అని మీరు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు.

కాకపోతే మీ లేఖ పూర్తిగా చదివిన తర్వాత ఇది సివిల్‌ కేసు మాత్రమే అని నాకు కూడా అనిపించలేదు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మీ కస్టమర్‌ని ఒప్పించుకుని కోర్టుముందు కాంప్రమైజ్‌ పిటిషన్‌ వేసుకుంటే కేసు కొట్టి వేయవచ్చు. అది కూడా ్ర΄ాసిక్యూషన్‌ అభ్యంతరాలను పరిగణించిన తర్వాత కోర్టు మాత్రమే నిర్ణయించగలదు. తప్పు చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో అని చూడడం కంటే అసలు తప్పు చేయకుండా ఉండడం మంచిది.

మీకు జరిగిన లావాదేవీలకు తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీకు శిక్ష పడే ఆస్కారం లేకపోలేదు. కేవలం చీటింగ్‌ కేసు మాత్రమే అయితే – ఏడు సంవత్సరాలు కన్నా తక్కువ శిక్ష కాబట్టి, మీరు అరెస్టు కాకపోవచ్చు. అంతకన్నా ఎక్కువ శిక్ష పడే కేసు ఏదైనా పెడితే అరెస్టవుతారు. ముందస్తు బెయిలు కోసం కోర్టులో పిటిషన్‌ వేసుకోవలసిన ఉంటుంది.

- శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్‌ చేయవచ్చు.

ఇదీ చదవండి: మరోసారి ఫూలన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement