జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన రిక్షాడ్రైవర్‌ కుమారుడు..! | E-rickshaw drivers son from Rajasthan cracks JEE Advanced 2026 | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన రిక్షాడ్రైవర్‌ కుమారుడు..!

Jun 5 2026 5:53 PM | Updated on Jun 5 2026 6:32 PM

 E-rickshaw drivers son from Rajasthan cracks JEE Advanced 2026

ఆ గ్రామంలోని విద్యార్థులకు ఐఐటీ జేఈఈ ఓ కల. పరిమిత వనరులు, దీనిపై సరైన అవగాహన లేకపోవడం తదిరతరాల వల్ల ఆ ఊరు విద్యార్థులందరికీ అదొక కలగా మిగిలిపోయింది. ఎవ్వరూ దాన్ని సాధ్యం చేయలేకపోయారు. కానీ ఒకే ఒక్కడు ఆ గ్రామం ఎన్నే ఏళ్ల కలను నిజం చేసి ఆ ఊరిపేరు మారుమ్రోగేలా చేశాడు. అంతేగాదు ఆ గ్రామం నుంచి ఐఐటీ చదువు అందుకోనున్న తొలి విద్యార్థిగా నిలిచాడు.

అతడే రాజస్థాన్‌ శ్రీగంగానగర్ జిల్లాలోని పఠాన్‌వాలా గ్రామానికి చెందిన ఇంద్రజిత్‌. అతనే ఈ రిక్షా డ్రైవర్‌ కుమారుడు. ఇంట్లో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ..చదువుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. ఇంద్రజిత్‌ పదోతరగతి చదువుతున్నప్పడే.. సీనియర్‌ విద్యార్థుల ద్వారా ఐఐటీ ప్రక్రియ గురించి తెలుసుకున్నాడు. అప్పటి వరకు స్థానిక పాఠశాలలో చదువుకున్న ఇంద్రజిత్‌..ఐఐటీల గురించి తెలుసుకోవడంతో ఓ కొత్త మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంట్లో ఎంత కష్టమైన ఆర్థిక పరిస్థితులున్నా.. ఇంజనీరింగ్‌ చదవాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యాడు. 

అయితే లక్ష్యం గట్టిగా ఉన్న ఆర్థిక పరిమితులు అందుకు ఉపకరించలేదు. దానికి బదులుగా ఆన్‌లైన్‌ లెర్నింగ్‌, స్వీయంగా ప్రిపరేవ్వడంపై ఆధారపడ్డాడు. ఓ పక్క గ్రామాల్లో తరుచుగా విద్యుత్‌ కోతలు ఉండటంతో స్టడీ మెటీరియల్‌ పొందడం చాలా కష్టంగా ఉండేది. దాంతో తండ్రి సూచనల మేరకు ఒక ఆచారణాత్మక పరిష్కారం లభించింది. అక్కడ సమీపంలోని గ్రామాలయ గ్రంథాలయంలో చేరాడు. అక్కడైతే ఇంటర్నెట్‌ సదుపాయం తోపాటు..చక్కగా కూర్చొని చదువుకునే చక్కటి వాతావరణం ఇంద్రజిత్‌కి ఎంతోగానో ఉపకరించింది. 

క్రమంగా అతడికి గ్రంథాలయం అతని ప్రిపరేషన్‌కి కేంద్రంగా మారింది. 2025లో జేఈఈ పరీక్ష రాసినా..అంతగా సంతృప్తినివ్వక లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని మరి మరోసారి ఐఐటీ జేఈఈకి ప్రిపరేయ్యాడు. సూర్యోదయానికి ముందే గణిత సాధన, పిజిక్స్‌, కెమిస్ట్రీ చదవడం సాగించేవాడు. అన్నింట్లకంటే నిలకడగా చదవడం అన్నది కీలకం అని తెలుసుకుని చాలా శ్రద్ధ ఆసక్తులతో ప్రిపరేషన్‌ కొనసాగించాడు. 

అయితే మార్క్‌టెస్ట్‌ల్లో వచ్చే మార్కులు తన లక్ష్యాన్ని చేరుకోవడంపై పలు సందేహాలను రేకెత్తించేవి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తూనే ఉండేవాడు. చివరికి సంవత్సరాల తరబడి పట్టుదల, స్వయంకృషితో జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026లో ఓబీసీ-ఎన్‌సీఎల్ విభాగంలో 1040వ ర్యాంకు సాధించి తన గ్రామం ఆకాంక్షను నెరవేర్చాడు. పైగా గ్రామాల్లో చదివే కుర్రాళ్లకు జేఈఈ చేధించడం కష్టం అన్నమాట అబ్ధం అనేలా తన గెలుపుతో చాటిచెప్పాడు. 

గ్రామీణ విద్యార్థులకు తన విజయం ఒక స్ఫూర్తిగా నిలిచి..వాళ్ల కూడా ఇలాంటి మంచి సక్సెస్‌ని అందుకోవాలని కోరుకుంటున్నా అంటున్నాడు ఇంద్రజిత్‌. ఇక తను ఐఐటి రూర్కీలో బీటెక్ డిగ్రీని అభ్యసించి, ఒక ప్రముఖ టెక్నాలజీ కంపెనీలో కెరీర్ నిర్మించుకోవాలని, కోరుకుంటున్నట్లు తెలిపాడు. పైగా తన గెలుపుకి కారణంగా తన కుంటుంబం సవంత్సరాల తరబడి అందించిన త్యాగం, మద్దతేనని చెబుతున్నాడు ఇంద్రజిత్‌.

(చదవండి: పారిశ్రామికవేత్తగా 8th డ్రాపౌట్‌ ..! ప్రముఖ బ్రాండ్లకు..)
 

Advertisement
 
Advertisement
Advertisement