సీబీఐ అధికారులు ఆఫ్రికా నుంచి వస్తున్నారా? | Justice Lakshmi Narayanan Fire On Tamil Nadu Police | Sakshi
Sakshi News home page

సీబీఐ అధికారులు ఆఫ్రికా నుంచి వస్తున్నారా?

Oct 1 2026 9:31 AM | Updated on Oct 1 2026 10:03 AM

Justice Lakshmi Narayanan Fire On Tamil Nadu Police

సాక్షి, చెన్నై: జెమ్‌ గ్రానైట్స్‌ యజమాని వీరమణిపై నమోదైన లైంగిక దాడి కేసుకు సంబంధించి దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలన్న అభ్యర్థనను మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చింది.వీరమణిపై ఉన్న కేసును సీబీఐ దర్యాప్తుకు మార్చాలని కోరుతూ వారాహి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మాజీ పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ జోక్యం వల్లే పోలీసులు బాధితులను గుర్తించలేదని, దర్యాప్తులో జాప్యం జరిగిందని ఆరోపించారు. వీరమణి, శాంతిల పేర్లు ఉన్నా సరిగ్గా విచారించలేదని, కేసును నీరుగూర్చడానికి భారీగా లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. 

కోర్టు విచారణ – న్యాయమూర్తి వ్యాఖ్యలు 
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ వి. లక్ష్మీ నారాయణన్‌ మాట్లాడుతూ.. ఈ కేసులో ప్రచారం ఆశించవద్దని, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కేవలం 4 రోజులే అయిందంటూ, తమరికి  తమిళనాడు పోలీసులపై ఏమాత్రం నమ్మకం లేదా? సీబీఐ అధికారులు ఏమైనా ఆఫ్రికా నుంచి వస్తున్నారా? అని ఘాటుగా ప్రశ్నించారు. పిటిషనర్‌ తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను తీసుకుని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరుకావాలని ఆదేశించారు. 

ఈ కేసుకు సంబంధించి సిట్‌ దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ, విచారణను అక్టోబర్‌ 7వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి సిట్‌ గురువారం ఒక అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన క్రిమినల్‌ న్యాయవాది జాన్‌ సత్యన్‌ కోర్టుకు తెలిపారు. అలా గే సిట్‌ బృందంలో వ్యక్తిగత కారణాల వల్ల తప్పు కున్న ఐపీఎస్‌ అధికారిణి గీతాంజలి స్థానంలో మరో అధికారిని నియమించినట్లు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement