ప్రేమ పేరుతో మైనర్‌పై లైంగిక దాడి | POCSO case registered against three individuals | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మైనర్‌పై లైంగిక దాడి

Sep 4 2026 2:11 AM | Updated on Sep 4 2026 2:11 AM

POCSO case registered against three individuals

ముగ్గురిపై పోక్సో కేసు నమోదు  

అల్వాల్‌ (హైదరాబాద్‌): మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిపై అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్లో పోక్సో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్‌లో నివసించే ఓ మహిళ తన కూతురును (17) అల్వాల్‌లోని ఆశాజ్యోతి ఆశ్రమంలో చేర్పించి చదివించింది. ఇదిలాఉండగా దూరపు బంధువు ఎల్లేష్‌ కొంతకాలంగా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ విషయం తెలుసుకున్న తల్లి అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని విచారించగా.. గతంలో ఇంటర్మీడియెట్‌ చదువుకునే సమయంలో (2025) రాఘవేందర్‌ రెడ్డి, 9వ తరగతి చదువుకునే సమయంలో (2023) రేంజు అనే వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి, బాధితురాలిని గురువారం సాయంత్రం భరోసా కేంద్రానికి తరలించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement