ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు? | Madras HC Directs DVAC To File Report On Inspections Raids | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు?

Oct 1 2026 9:47 AM | Updated on Oct 1 2026 10:09 AM

Madras HC Directs DVAC To File Report On Inspections Raids

ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తమ వద్ద ఎంత నగదు ఉంచుకోవచ్చనే అంశంపై త్వరలో ఒక స్పష్టమైన విధానాన్ని  నిర్ణయించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం మదురై హైకోర్టుకు వెల్లడించింది. తిరునల్వేలి జిల్లా ముకుడల్‌ సబ్‌–రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కాలా అనే మహిళ 2021లో విధుల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అదనంగా రూ. 45,000 నగదు కలిగి ఉన్నారనే ఆరోపణపై కేసు నమోదైంది. 

దీనిపై ఆమెపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. కాగా ఆ క్రమశిక్షణా చర్యలను రద్దు చేయాలని కోరుతూ ఆమె మదురై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ పి. పుగళేంది.. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులో ఎంత నగదు తమ వద్ద ఉంచుకోవచ్చనే దానిపై ఒక స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు ప్రధాన న్యాయవాది స్పందిస్తూ, దీనిపై ప్రస్తుతం ప్రభుత్వంలో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని, సమయం కావాలని కోరారు. 

ఏసీబీ  నివేదికకు ఆదేశం 
ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలకమైన ప్రశ్నలు సంధించారు. గత 5 సంవత్సరాలలో తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఎన్ని దాడులు నిర్వహించింది? ఆ దాడుల్లో ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారు? ఎన్ని కేసులు నమోదు చేశారు? ఆ కేసుల ప్రస్తుత స్థితి ఏమిటి? అనే వివరాలపై నివేదిక సమర్పించాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.    

ఇదీ చదవండి: హాల్‌మార్కింగ్ ఛార్జీల పెంపుతో నకిలీ ముద్రలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement