అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్, యూపీ కాంగ్రెస్‌ సారథులమార్పు  | Congress reshuffles Punjab and UP leadership ahead of upcoming polls | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్, యూపీ కాంగ్రెస్‌ సారథులమార్పు 

Oct 3 2026 5:53 AM | Updated on Oct 3 2026 5:53 AM

Congress reshuffles Punjab and UP leadership ahead of upcoming polls

న్యూఢిల్లీ: కీలకమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ల అసెంబ్లీలకు మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల పార్టీ సారథులను కాంగ్రెస్‌ అధిష్టానం మార్చివేసింది. యూపీ నూతన సార««థిగా ప్రస్తుతం సీఎల్‌పీ నేతగా ఉన్న ఆరాధనా మిశ్రా మోనాను నియమించింది. ఈమె పారీ్టకి చెందిన రాజ్యసభ ఎంపీ ప్రమోద్‌ తివారీ కుమార్తె కావడం గమనార్హం. యూపీసీసీ అధ్యక్షుడిగా అజయ్‌ రాయ్‌ 2023 నుంచి కొనసాగుతున్నారు. 

సీఎల్‌పీ నేతగా నూతనంగా చౌదరి వీరేంద్ర సింగ్‌ను, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఇమ్రాన్‌ మసూద్‌ను నియమించింది. వీరితోపాటు యూపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులుగా దేవీందర్‌ నిషాద్, అలోక్‌ ప్రసాద్‌లకు బాధ్యతలప్పగించింది. తాజా నియామకాల ద్వారా బ్రాహ్మణ, ముస్లిం, దళిత వర్గాల సామాజిక సమీకరణాలను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం యతి్నంచింది. మోనా నియామకం ద్వారా పార్టీకి మహిళల పరంగా మైలేజీ పెరుగుతుందని పార్టీ ఆశాభావంతో ఉంది. రానున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పారీ్టతో జరిగే అవకాశమున్న సీట్ల పంపిణీ విష యంలో బేరసారాలకు అవకాశమేర్పడుతుందని భావిస్తోంది. 

హాకీ మాజీ సారథికి పంజాబ్‌ బాధ్యతలు 
పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ పర్గత్‌ సింగ్‌కు అప్పగించింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అమరీందర్‌ సింగ్‌ వారియర్‌ గురువారం పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఆయన స్థానంలో పర్గత్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీలన్నీ యథా ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు. వారియర్‌ పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా 2022 నుంచి కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన్ను కొనసాగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై అసమ్మతి పెల్లుబుకడం తెల్సిందే. ఎన్నికల వేళ తీవ్ర రూపం దాలి్చన అంతర్గత కలహాలు అధిష్టానానికి తలనొప్పిగా తయారయ్యాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement