రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ చేతిలో మోసపోయిన రాంచీ యువతి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
రాంచీ: నర్సుగా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి యువతిని దుబాయ్‌కి పంపించారు. తీరా అక్కడికెళ్లాక పాస్‌పోర్టు తీసుకుని బందీగా ఉంచి, ఇళ్లలో పనిచేయిస్తున్నారు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జార్ఖండ్‌లో ఓ రిక్రూట్‌మెంట్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాంచీలోని ఛోటా ఘఘ్రా ప్రాంతానికి చెందిన మోనికా కచ్చప్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నది.
సోషల్ మీడియాలో దుబాయ్‌లో ఉద్యోగమంటూ ప్రైవేట్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఏఎండీ ట్రెండ్ సొల్యూషన్స్ ప్రకటనను చూసింది. ఆ ఉద్యోగం కోసం ఏజెన్సీని సంప్రదించింది. మోనిక ఆసక్తిని సొమ్ము చేసుకున్న ఏజెన్సీ ప్రతినిధి ప్రియాంక, మోనికా నుంచి ఏప్రిల్‌లో రూ.15,000 తీసుకుని విజిటింగ్ వీసా మీద మే5న ఆమె షార్జాకు పంపించింది. ఆమెను రిసీవ్ చేసుకున్న అక్కడి డ్రైవర్, యువతి పాస్‌పోర్టును స్వా«దీనం చేసుకున్నాడు. ఆమె 12,600 ధీరామ్‌లు (దాదాపు మూడున్నర లక్షలు)అప్పు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారు చేసి సంతకం చేయించుకున్నాడు.
నర్సు ఉద్యోగానికి బదులుగా ఇళ్లలో పనిచేయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. పాస్‌పోర్టు అడిగితే.. మూడున్నర లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి ఏజెంట్ ప్రియాంక ఆర్య, ఆమె భర్త రితే‹Ù, ఎండీ మెరాజ్ అన్సారీలపై రాంఛీ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను సురక్షితంగా భారత్‌కు రప్పించాలని విదేశాంగ శాఖ(ఎంఈఏ), జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. రిక్రూట్‌మెంట్ ఏజెన్సీపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాంగ శాఖ దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది.


