భారతీయత కొందరి సంక్షేమమే కోరుకోదు!  | India has a role to play in troubled world | Sakshi
Sakshi News home page

భారతీయత కొందరి సంక్షేమమే కోరుకోదు! 

Oct 3 2026 6:24 AM | Updated on Oct 3 2026 6:24 AM

India has a role to play in troubled world

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్య

ముంబై: దేశం బలహీనపడితే, ధర్మానికి ముప్పు ఏర్పడితే రెండింటినీ సక్రమంగా ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత అని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధ్యక్షుడు మోహన్‌ భాగవత్‌ పిలుపునిచ్చారు. భారతీయ భావజాలం ఒక నిర్దిష్ట వర్గం సంక్షేమానికి మాత్రమే పరిమితమై ఉండదని అన్నారు. ‘‘మన పూరీ్వకులు మొత్తం ప్రపంచం సంక్షేమం గురించి ఆలోచించారు. అందుకే సర్వేజన సుఖినో భవంతు అంటాము మనం’’అని చెప్పారు. 

జైన సంస్థ ‘ఆలిండియా విహార్‌ సేవా గ్రూప్‌’14వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘కొంతమంది అభివృద్ధి చెందాలి, మరికొందరు అభివృద్ధి చెందకూడదనే ద్వంద్వ ప్రమాణాలకు ఇక్కడ స్థానం లేదు’’అని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది మాత్రమే ఇబ్బంది పడుతున్నా అది అందరి ఆనందాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. 


ప్రపంచంలో ప్రస్తుతం ఎన్నో వైరుద్ధ్యాలు ఉన్నాయని, ఒకదాని కోసం ఇంకోదాన్ని వదులుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించలేమని అన్నారు. ‘‘అభివృద్ధి పెరిగే కొద్దీ పర్యావరణం దెబ్బతింటోంది. పర్యావరణాన్ని కాపాడాల్సిన చోట అభివృద్ధి జరగడం లేదనే పరిస్థితి ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ పెరిగే కొద్దీ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలోనూ పతనం కనిపిస్తోంది’’అని భాగవత్‌ అన్నారు. 

దేశం ధర్మం వేరు కాదు... 
భారతీయ భావనలో దేశాన్ని ధర్మం నుంచి వేరు చేయలేమని మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారు. ‘‘మన దేశం, ధర్మం వేర్వేరు కాదు. దేశం ప్రయోజనం ధర్మం; దేశాన్ని నిలబెట్టేది ధర్మం. ఈ రెండూ ఒకదానిపై ఆధారపడి ఉంటాయి. ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది; ఒకటి లేకపోతే మరొకటి కూడా ఉండదు’’అని అన్నారు. దేశం బలహీనపడితే ధర్మం కూడా ముప్పును ఎదుర్కొంటుందని ధర్మాచరణ బలహీనమైతే దేశం, ధర్మం రెండింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంటుందని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement