ప్రధాని మోదీకి చక్కటి ఆలోచనలున్నాయి  | PM Narendra Modi has good ideas for settlement of Ukraine conflict | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి చక్కటి ఆలోచనలున్నాయి 

Oct 3 2026 6:08 AM | Updated on Oct 3 2026 6:08 AM

PM Narendra Modi has good ideas for settlement of Ukraine conflict

ఉక్రెయిన్‌ సంఘర్షణను ముగించే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు 

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంస

మాస్కో:  రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణను పరిష్కరించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీకి చాలా చక్కటి ఆలోచనలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. ప్రతి సమావేశంలోనూ మోదీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటారని తెలిపారు. గురువారం జరిగిన వాల్డాయ్‌ ఇంటర్నేషనల్‌ డిస్కషన్‌ క్లబ్‌ వార్షిక సమావేశంలో పుతిన్‌ మాట్లాడారు. 

‘‘యుద్ధాలను ముగించడంపై ప్రధానమంత్రి మోదీ వైఖరి విషయానికి వస్తే.. మా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంఘర్షణను ముగించే అంశాన్ని ఆయన నిరంతరం ప్రస్తావిస్తూ ఉంటారు. రష్యా–ఉక్రెయిన్‌ ఘర్షణ గురించి ప్రశ్నలు అడిగే ప్రపంచ నాయకుల్లో మోదీ ఒకరని నేను చెప్పగలను. మేము జరిపే ప్రతి సమావేశంలోనూ మోదీ ఈ అంశాలను ప్రస్తావిస్తారు. ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో మోదీ వద్ద చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి’’అని పుతిన్‌ స్పష్టంచేశారు. 

అలాగే బుధవారం ఓ సదస్సులో పుతిన్‌ ప్రసంగించారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. భారతదేశం తన విస్తృతి, వైవిధ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోందని అన్నారు. ‘‘ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 150 కోట్ల మంది జనాభాలో 60 కోట్ల మంది భారతీయులు తమ మాతృభాష అయిన హిందీని మాట్లాడతారు. మిగిలిన వారు తమ మాతృ భాషలను మాట్లాడతారు. అయినప్పటికీ వారందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని మోదీ నాకు చెప్పారు. ఇది నిజంగా అద్భుతం, ప్రశంసనీయం. వైవిధ్యం, ఐక్యత ఎలా కలిసి ఉండగలవో చెప్పడానికి భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకత ఉంది. అది కచి్చతంగా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. నిజంగానే మనం నేర్చుకోవాల్సిన విషయం’’అని కొనియాడారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement