నిరసన ప్రదేశంపై స్పష్టతనిచ్చిన సీజేపీ.. జంతర్‌ మంతర్‌ కాదు.. | Only Scheduled At Shivaji Park CJP Clears Air On Oct 2 Protest | Sakshi
Sakshi News home page

నిరసన ప్రదేశంపై స్పష్టతనిచ్చిన సీజేపీ.. జంతర్‌ మంతర్‌ కాదు..

Sep 30 2026 6:42 PM | Updated on Sep 30 2026 7:16 PM

  Only Scheduled At Shivaji Park CJP Clears Air On Oct 2 Protest

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న కాక్రోచ్ జంతా పార్టీ ‘జైల్ భరో’ ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో నిరసన వేదికకు సంబంధించి పలు సందేశాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిరసన ముంబైలోని శివాజీ పార్క్‌లో మాత్రమే జరుగుతుందని సీజేపీ బుధవారం స్పష్టం చేసింది.

వివిధ నగరాల్లో నిరసనలు జరుగుతాయంటూ వచ్చిన వార్తలపై గందరగోళం నెలకొందని సీజేపీ సహ సమన్వయకర్త ఆశుతోష్ రంకా సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. రంకా ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘సీజేపీకి సంబంధించి ఆన్‌లైన్‌లో పలు సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఇస్తున్నాం. కాక్రోచ్ జంతా పార్టీ అక్టోబర్ 2 నిరసన ముంబైలోని శివాజీ పార్క్‌లో మాత్రమే నిర్వహించనుంది’’ అని తెలిపారు. రానున్న రోజుల్లో వివిధ నగరాలకు కూడా వెళ్తామని, దీనికి సంబంధించిన సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని అని ఆయన తెలిపారు.

సీజేపీ అక్టోబర్ 2 ‘ముంబై చలో’ నిరసన
జైల్ భరో అంటే నిరసనలో భాగంగా పెద్ద సంఖ్యలో అరెస్టులకు సిద్ధంగా ఉండే ఆందోళన విధానం. ఎక్స్‌లో సీజేపీ చేసిన పోస్టులో, ‘‘ముంబై చలో... శివాజీ పార్క్, సాయంత్రం 4 గంటలకు, గేట్ నంబర్ 6’’ అని పేర్కొంది. అయితే, శివాజీ పార్క్‌లో అక్టోబర్ 2న సీజేపీ నిర్వహించనున్న నిరసనకు ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. 2013 జనవరి 4న బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు, 2016 జనవరి 20న మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ఆధారంగా ఉన్న ఆంక్షలను పోలీసులు ఇందుకు కారణంగా పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని ఎంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

దీంతో అనుమతి నిరాకరణపై సీజేపీ ప్రశ్నలు లేవనెత్తింది. అక్టోబర్ 2న ముంబై నుంచి దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించనున్నట్లు సీజేపీ తన నిర్ణయాన్ని కొనసాగించింది. సర్ అంశంపై వివాదం మొదలైంది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన కొన్ని నిబంధనలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్‌బీర్ సింగ్ సంధు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఇందులో ఫారం 6ను చేర్చడంపై అభ్యంతరం కూడా ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement