రూ.లక్ష చెల్లించకుంటే ఇళ్ల తాత్కాలిక కేటాయింపు రద్దు | Indiramma LIG Housing Scheme: Beneficiaries Face Payment Deadline Shock | Sakshi
Sakshi News home page

రూ.లక్ష చెల్లించకుంటే ఇళ్ల తాత్కాలిక కేటాయింపు రద్దు

Oct 5 2026 9:16 AM | Updated on Oct 5 2026 9:49 AM

Indiramma LIG Housing Scheme: Beneficiaries Face Payment Deadline Shock

సాక్షి, హైదరాబాద్‌: పేదల సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ గృహాల పథకానికి ఎంపికైన లబ్ధిదారుల నుంచి ఆదిలోనే ఊహించని షాక్‌ తగులుతోంది. రూ.5 లక్షల మేర సబ్సిడీని భరించి కేవలం రూ.6 లక్షలు లబ్ధిదారుడి వాటాకు అందించడానికి సిద్ధమైంది. అర్హత సాధించిన వారిలో  లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి  తాత్కాలిక కేటాయింపు ప్రతం జారీ చేసింది. 

మొదటి విడుత కింద రూ. లక్ష చెల్లించాలని వారం రోజులు గడువు విధించినప్పటికీ అందులో 59.46 శాతం మాత్రమే చెల్లించారు. దీంతో చేసేదేమీలేక మొదటి విడత చెల్లింపునకు హౌసింగ్‌ శాఖ చివరి అవకాశం కల్పించింది. ఈ నెల 9 వరకు గడువు పొడిగించినట్లు హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. గడువులోగా చెల్లించని పక్షంలో సంబంధిత లబి్ధదారు పేరున జారీ చేసిన ప్రొవిజనల్‌ కేటాయింపును రద్దు చేస్తామని వెల్లడించారు. రద్దు కారణంగా ఖాళీ అయ్యే ఫ్లాట్లను వెయిటింగ్‌ లిస్టులోని ఇతర అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయించేందుకు పరిశీలిస్తామని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement