మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీపై హత్యాయత్నం కేసు | Case Filed Against Minister Konda Surekhas Former OSD Sumanth | Sakshi
Sakshi News home page

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీపై హత్యాయత్నం కేసు

Aug 20 2026 5:54 PM | Updated on Aug 20 2026 6:28 PM

Case Filed Against Minister Konda Surekhas Former OSD Sumanth

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. మేడ్చల్‌ మల్కాజగిరి జిల్లా మేడిపల్లిలో సుమంత్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాడ్లుతో దాడి చేసినట్లు వ్యాపారి గొంగడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. సుమంత్‌పై 109 సెక్షన్‌ కింద కేసు నమోదు అయ్యింది. 

అయితే మేడిపల్లిలో పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌(నేరం ఎక్కడ జరిగినా, ఏ ప్రాంతానికి చెందినదైనా సరే... బాధితులు తమకు దగ్గరలోని ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించుకోవడం) నమోదు చేయడంతో ఇప్పుడు ఆ కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయ్యింది. సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement