సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ, ఆయుష్ శర్మ ముంబైలోని ఒక విశాలమైన ఇంట్లో నివశిస్తున్నారు. ఆ ఇల్లు చూస్లే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎంత విశాలంగా అంటే ఊహకందనంతా బడా ఇల్లు. యూట్యూబ్ వ్లాగ్ కోసం సందర్శించిన చిత్ర నిర్మాత ఫరాఖాన్‌నే ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద ఇల్లా అని ఆమె విస్తుపోవడమే కాదు..ఈ ఇంట్లో క్రికెట్ కూడా ఆడొచ్చు అని ఫన్నీగా అన్నారు. పరాఖాన్, ఆమె కుక్ దిలీప్ అర్పిత--ఆయుష్‌ల ఇంట్లోకి ప్రవేశించగానే ఆ ఇరువురు దాని విశాలతను చూసి షాకయ్యారు.

ఈ ఇంటిని సింపుల్‌గా "ముంబై కా దుబాయ్" అని ఆయుష్ పిలవగా, ఫరా ఇది దుబాయ్ కంటే బాగుంటుందని బదులిచ్చింది. ఇంటీరియర్స్ ఎక్కువగా తెలుపు, బేజ్, నలుపు రంగులతో కూడిన తటస్థ రంగుల పాలెట్‌ను అనుసరిస్తాయి. చెక్క ఫ్లోరింగ్, మార్బుల్ అంశాలు, పెద్ద సోఫాలు, ఆకట్టుకునే లైటింగ్, జాగ్రత్తగా ఎంచుకున్న అలంకరణ వస్తువులు ఇంటికి సమకాలీన రూపాన్ని ఇస్తాయి. ఇక్కడ క్రికెట్ లేదా ఫుట్‌బాల్ ఆడుకోవడానికి సరిపడా స్థలం ఉంది. ఆయుష్ తన భార్యకు పెద్ద ఇళ్లంటే ఇష్టమని అందుకే ఇంత భారీ ఇల్లు ఇచ్చారంటూ ఆటపట్టించారు.
కానీ కొద్ది స్థలమే ఉపయోగిస్తుందని అన్నారు. అలాగే భాయ్ సల్మాన్ ఖాన్ తమకు ప్రత్యేకమైన కళాఖండాన్ని బహుమతిగా ఇచ్చారని, ఇది ఇంట్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి అత్యంత ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పారు. దీన్ని తమ కుటుంబం చాలా అదృష్టంగా భావిస్తుందని అన్నారు.
ఇక డైనింగ్ రూమ్‌లో పెద్ద నల్లటి పెండెంట్ లైట్ కింద పొడవైన డైనింగ్ టేబుల్ ఉంది. నివాసం అంతటా మార్బుల్ ఫినిషింగ్‌లు, శిల్పాలు, ఇతర కళాఖండాలు విస్తరించి ఉన్నాయి. అంతేగాదు వంటగదిలోనే నాలుగు ఏసీలు, మూడు రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. ఆ ఇంటి పర్యటలో అతి పెద్ద ఆకర్షణలలో ఒకటి భారీ కిచెన్. ఈ వంటగదిలో ఏకంగా మూడు పెద్ద రిఫ్రిజిరేటర్లు, నాలుగు ఎయిర్ కండిషనర్లు ఉండటం విశేషం.
అయితే ఇక్కడ వంట తక్కువగా చేస్తామని, వంటవాడు లేడని ఆయుష్ వెల్లడించారు. ఒకప్పుడు తమకు వంటవాడు ఉండేవాడని, అతని పేరు మోంటుజీ అని, అతని జీతం తెలుసుకుని షాకయ్యానని అంటున్నాడు ఆయుష్. దానికంటే మా బిల్డింగ్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినడం చాలా బెస్ట్ అని సరదాగా అన్నారు.
అలాగే తమకు సల్మా ఖాన్ ప్రతిరోజూ ఇంటి భోజనం పంపిస్తారని, ఆయన తల్లి సల్మా ఖాన్ తప్పకుండా భోజనం పంపిస్తారని వెల్లడించారు. అయితే తాము ప్రయాణాల్లో భారతీయ ఆహారమే తినేలా కూడా వంటవాడిని తీసుకువెళ్తామని చెప్పారు. అలాగే ఈ ఇంట్లో తనకంటూ వ్యక్తిగతం ఒక గది ఉందని, దాన్ని కూడా తన భార్య అర్పిత ఆక్రమించేస్తోందంటూ ఫరాఖాన్‌కి ఫిర్యాదు చేశారు.
కాగా, అర్పిత ఖాన్ -ఆయుష్ శర్మ చాలా ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత, నవంబర్ 2014లో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, 2016లో కుమారుడు అహిల్, 2019లో కుమార్తె ఆయత్.
(చదవండి: మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా సైకాలజీ స్టూడెంట్..!)


