breaking news
Fara khan
-
సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా..!
సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ, ఆయుష్ శర్మ ముంబైలోని ఒక విశాలమైన ఇంట్లో నివశిస్తున్నారు. ఆ ఇల్లు చూస్లే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎంత విశాలంగా అంటే ఊహకందనంతా బడా ఇల్లు. యూట్యూబ్ వ్లాగ్ కోసం సందర్శించిన చిత్ర నిర్మాత ఫరాఖాన్నే ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద ఇల్లా అని ఆమె విస్తుపోవడమే కాదు..ఈ ఇంట్లో క్రికెట్ కూడా ఆడొచ్చు అని ఫన్నీగా అన్నారు. పరాఖాన్, ఆమె కుక్ దిలీప్ అర్పిత--ఆయుష్‌ల ఇంట్లోకి ప్రవేశించగానే ఆ ఇరువురు దాని విశాలతను చూసి షాకయ్యారు. ఈ ఇంటిని సింపుల్‌గా "ముంబై కా దుబాయ్" అని ఆయుష్ పిలవగా, ఫరా ఇది దుబాయ్ కంటే బాగుంటుందని బదులిచ్చింది. ఇంటీరియర్స్ ఎక్కువగా తెలుపు, బేజ్, నలుపు రంగులతో కూడిన తటస్థ రంగుల పాలెట్‌ను అనుసరిస్తాయి. చెక్క ఫ్లోరింగ్, మార్బుల్ అంశాలు, పెద్ద సోఫాలు, ఆకట్టుకునే లైటింగ్, జాగ్రత్తగా ఎంచుకున్న అలంకరణ వస్తువులు ఇంటికి సమకాలీన రూపాన్ని ఇస్తాయి. ఇక్కడ క్రికెట్ లేదా ఫుట్‌బాల్ ఆడుకోవడానికి సరిపడా స్థలం ఉంది. ఆయుష్ తన భార్యకు పెద్ద ఇళ్లంటే ఇష్టమని అందుకే ఇంత భారీ ఇల్లు ఇచ్చారంటూ ఆటపట్టించారు. కానీ కొద్ది స్థలమే ఉపయోగిస్తుందని అన్నారు. అలాగే భాయ్ సల్మాన్ ఖాన్ తమకు ప్రత్యేకమైన కళాఖండాన్ని బహుమతిగా ఇచ్చారని, ఇది ఇంట్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి అత్యంత ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పారు. దీన్ని తమ కుటుంబం చాలా అదృష్టంగా భావిస్తుందని అన్నారు. ఇక డైనింగ్ రూమ్‌లో పెద్ద నల్లటి పెండెంట్ లైట్ కింద పొడవైన డైనింగ్ టేబుల్ ఉంది. నివాసం అంతటా మార్బుల్ ఫినిషింగ్‌లు, శిల్పాలు, ఇతర కళాఖండాలు విస్తరించి ఉన్నాయి. అంతేగాదు వంటగదిలోనే నాలుగు ఏసీలు, మూడు రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. ఆ ఇంటి పర్యటలో అతి పెద్ద ఆకర్షణలలో ఒకటి భారీ కిచెన్. ఈ వంటగదిలో ఏకంగా మూడు పెద్ద రిఫ్రిజిరేటర్లు, నాలుగు ఎయిర్ కండిషనర్లు ఉండటం విశేషం. అయితే ఇక్కడ వంట తక్కువగా చేస్తామని, వంటవాడు లేడని ఆయుష్ వెల్లడించారు. ఒకప్పుడు తమకు వంటవాడు ఉండేవాడని, అతని పేరు మోంటుజీ అని, అతని జీతం తెలుసుకుని షాకయ్యానని అంటున్నాడు ఆయుష్. దానికంటే మా బిల్డింగ్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినడం చాలా బెస్ట్ అని సరదాగా అన్నారు. అలాగే తమకు సల్మా ఖాన్ ప్రతిరోజూ ఇంటి భోజనం పంపిస్తారని, ఆయన తల్లి సల్మా ఖాన్ తప్పకుండా భోజనం పంపిస్తారని వెల్లడించారు. అయితే తాము ప్రయాణాల్లో భారతీయ ఆహారమే తినేలా కూడా వంటవాడిని తీసుకువెళ్తామని చెప్పారు. అలాగే ఈ ఇంట్లో తనకంటూ వ్యక్తిగతం ఒక గది ఉందని, దాన్ని కూడా తన భార్య అర్పిత ఆక్రమించేస్తోందంటూ ఫరాఖాన్‌కి ఫిర్యాదు చేశారు. కాగా, అర్పిత ఖాన్ -ఆయుష్ శర్మ చాలా ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత, నవంబర్ 2014లో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, 2016లో కుమారుడు అహిల్, 2019లో కుమార్తె ఆయత్. View this post on Instagram A post shared by Aayush Sharma (@aaysharma) (చదవండి: మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా సైకాలజీ స్టూడెంట్..!) -
ఐవీఎఫ్.. శారీరకంగా, మానసికంగా ఎంత బాధ ఉంటుందంటే.. కొరియోగ్రాఫర్
బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్(Director and choreographer) ఫరాఖాన్(Farah Khan) తరుచుగా తన ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) జర్నీ గురించి మాట్లాడుతుంటారు. ఇటీవల నటి డెబినా బోనర్టీతో పాడ్‌కాస్ట్ సంభాషణలో ఫరాఖాన్ ఐవీఎఫ్ సవాళ్ల గురించి భావోద్వేగంగా చెబుతూ నాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. నిజానికి ఐవీఎఫ్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందా..? శారీరకంగా, మానసికంగా చాలా దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయా అంటే..ఫరాఖాన్ తన ఐవీఎఫ్ జర్నీ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తామని అన్నారు. ముందుగా మన శరీరాన్ని సిద్ధం చేసేందుకు వైద్యులు చాలా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారని అన్నారు. ఈ ప్రక్రియలో ప్రాథమికంగా అండాశయాల కోసం రోజుకు ఐదు ఇంజెక్షన్లు(5 injections) తీసుకున్నట్లు తెలిపారు. అలాగే "గర్భాశయ పొరను సరిచేసేందుకు అండాశయాలు సరిగ్గ పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ప్రెగ్నైల్ అనే హార్మోన్‌ని ఇంజెక్షన్ రూపంలో కడుపుకు, తొడకు ఇస్తారు. ఇది ఎంత బాధాకరంగా ఉంటుందంటే.. మాటల్లో చెప్పలేం. కానీ ఇక్కడ బిడ్డను కనాలనే ఆలోచన ఆ బాధను ఓర్చుకునేలా చేస్తుంది. అయితే ఈ హర్మోన్ ఇంజెక్షన్లు మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. అకస్మాత్తుగా ఏడవడం, మూడీగా ఉండటం, చికాకు తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్యలన్నింటిని అర్థం చేసుకునే భర్త అండదండ ఉంటేనే ఈ ఐవీఎఫ్ ప్రక్రియను విజయవంతంగా ఎదుర్కొని బిడ్డను కనగలరని అన్నారు." ఫరాఖాన్. ఆమె 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా ముగ్గురు పిల్లలకి తల్లయ్యారు. View this post on Instagram A post shared by The Debinna Bonnerjee Show (@thedebinnabonnerjeeshow)ఈ ఐవీఎఫ్ వంధ్యత్వం(Infertility)తో పోరాడుతున్న వారికి ఆశను అందిస్తుండగా, దీన్ని చేయించుకోవాలంటే ఆయా వ్యక్తులుకు అంతే స్థాయిలో అపారమైన స్థైర్యం కావాలి. ముఖ్యంగా శారీరక, మానసిక భావోద్వేగాలను అదుపు చేసుకోగలిగే శక్తి ఉండాలి లేదా స్ట్రాంగ్‌గా ఎదుర్కొనేలా సిద్ధపడాలి.హార్మోన్ల చికిత్సల వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు..తరచుగా అండాశయాలను ఉత్తేజపరిచేందుకు, పిండ ఇంప్లాంటేషన్ కోసం శరీరాన్ని సిద్ధం చేసేలా హార్మోన్ల చికిత్సలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల వీటివల్ల అనేక రకాల దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదంటున్నారు. అవేంటంటే..ఓవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS): అండాశయాల సేకరణ కోసం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్ల కారణంగా అండాశయాలు వాపు రావడం జరుగుతుంది. ఇది చాలా బాధకరమైన స్థితి. దీని కారణంగా పొట్ట ఉబ్బరం, వికారం, వాంతులు, కడుపు నొప్పి తదితర సమస్యలు వస్తాయి. మూడ్ స్వింగ్స్, భావోద్వేగ అసమతుల్యత: IVF చేయించుకుంటున్న సమయంలో తరుచుగా అనుభవించే మానసిక కల్లోలం, చిరాకు, భావోద్వేగ బాధలకు హార్మోన్ల హెచ్చు తగ్గులే మూల కారణం. దీనివల్ల మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను ప్రభావితం చేసే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.ఇంజెక్షన్ ఇచ్చే ప్రాంతంలో నొప్పి లేదా వాపుకి గురవ్వడం.అలసట, తలనొప్పులు నిర్జలీకరణం, నిద్రలేకపోవడం వంటి సమస్యలు ఎదరవుతాయని చెబుతున్నారు నిపుణులుభావోద్వేగ సవాళ్లని అధిగమించాలంటే..యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) లేదా కౌన్సెలింగ్ వంటివి తీసుకోవడంవాకింగ్ లేదా స్విమ్మింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలతో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొనవచ్చు. కుటుంబ సహకారం తీసుకోవడం తదితరాలతో ఈ ఐవీఎఫ్‌తో వచ్చే భావోద్వేగ సవాళ్లని అధిగమించగలుగుతారు. -
‘ఆమెను శ్రీదేవితో పోల్చకండి’
ముంబై : బాలీవుడ్ దర్శకురాలు, కొరియెగ్రాఫర్ ఫరాఖాన్ రీల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ అవార్డ్స్ కమిటీకి జ్యూరి మెంబర్‌గా వ్యవహరిస్తున్న ఆమె ఈ ఏడాది కొత్త కథాంశాలతో సినిమాలు వచ్చాయని, ‘లిప్‌స్టిక్ అండర్ బుర్ఖా’ సందేశంతో పాటు వినోదం కూడా పంచిందన్నారు. న్యూటన్, హిందీ మీడియమ్ సినిమాలు కూడా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన బాలీవుడ్ అందాల నటి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. లెజండరీ హీరోయిన్ శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని, కెరీర్ తొలినాళ్లలో ఆమె తననెంతో ప్రోత్సహించారన్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ‘దడక్’ సినిమాకు కొరియోగ్రఫీ చేస్తున్న ఫరా, జాన్వీ కూడా మంచి డాన్సర్ అని ప్రశంసలు కురిపించారు. అయితే ఇంకా జాన్వీ నేర్చుకునే దశలోనే ఉందదని.. ఇప్పుడే ఆమెను శ్రీదేవితో పోల్చడం సరైంది కాదన్నారు. మై హూనా సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఫరాఖాన్.. కొంత కాలంగా దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. ఈ మీడియా సమావేశంలో తన భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుతూ రొటీన్ సినిమాలతో విసిగెత్తిపోయాను. స్టైల్ మార్చి ఈసారి బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్నాను తన మనసులో మాట బయటపెట్టారు. -
మా కుక్కలకి, నీ పిల్లులకి పెళ్లి!
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కుటుంబంలోకి ఇద్దరు కొత్త సభ్యులు చేరారట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. తమ ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చి చేరిన రెండు పిల్లుల ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. వాటికి హీర్ మీర్జా, జారా మీర్జా అనే పేర్లు కూడా పెట్టింది. చూడముచ్చటగా ఉన్న ఆ రెండు తెల్లటి పిల్లి పిల్లలు ఓ సోఫాలో విశ్రాంతి తీసుకుంటుండగా ఫొటో తీసి దాన్ని షేర్ చేసింది. దాంతో.. దర్శకురాలు ఫరాఖాన్ కూడా స్పందించింది. తాను ఇప్పటికే పెంచుకుంటున్న కుక్క పిల్లలకు, ఈ పిల్లి పిల్లలకు పెళ్లి చేద్దామంటూ ఓ ప్రపోజల్ తీసుకొచ్చింది. దీనివల్ల తామిద్దరం వియ్యపురాళ్లం అవుతామని కూడా చెప్పింది. Now ur cats can marry my puppies n v can become in laws!! https://t.co/1mVXtld0M1 — Farah Khan (@TheFarahKhan) March 7, 2016 -
అతడే నా ఫేవరెట్!
ఖాన్ల త్రయం, హృతిక్ రోషన్... ఎందరో స్టార్లకు డ్యాన్స్ సీక్వెన్స్‌లు చేసిన ఫరాఖాన్‌కు వీళ్లలో ఎవరూ నచ్చలేదట. ఎంతమంది ఎన్ని ‘మెలికలు’ తిరిగినా... కామెడీ స్టార్ గోవింద డ్యాన్స్ చూసినంత కిక్కు రాదట. బాలీవుడ్లో సిసలైన డ్యాన్స్ కింగ్ అంటే అతడే అంటోందీ డెరైక్టర్‌గా మారిన కొరియోగ్రాఫర్. ‘గోవిందా డ్యాన్స్ చేస్తుంటే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతా’ అంటోంది. పైగా... ‘డ్యాన్స్ కమ్స్ దిల్ సే. స్టెప్స్ కమ్ ఫ్రమ్ ది మైండ్’ అంటూ కొత్త కొత్తగా ఏదేదో చెప్పేసింది తాజాగా ఓ డ్యాన్స్ రియాల్టీ షో లాంచింగ్‌లో!


