‘ఆమెను శ్రీదేవితో పోల్చకండి’ | Farah Khan Stated Janhvi Kapoor Is Good Dancer | Sakshi
Sakshi News home page

Mar 13 2018 5:18 PM | Updated on Apr 3 2019 6:34 PM

Farah Khan Stated Janhvi Kapoor Is Good Dancer  - Sakshi

ముంబై : బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియెగ్రాఫర్‌ ఫరాఖాన్‌ రీల్ మూవీ అవార్డ్స్‌ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించారు.  ఈ అవార్డ్స్‌ కమిటీకి జ్యూరి మెంబర్‌గా వ్యవహరిస్తున్న ఆమె ఈ ఏడాది కొత్త కథాంశాలతో సినిమాలు వచ్చాయని, ‘లిప్‌స్టిక్‌ అండర్‌ బుర్ఖా’ సందేశంతో పాటు వినోదం కూడా పంచిందన్నారు. న్యూటన్‌, హిందీ మీడియమ్‌ సినిమాలు కూడా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కాయని ప్రశంసించారు.
 
ఈ సందర్భంగా ఇటీవల మరణించిన బాలీవుడ్ అందాల నటి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. లెజండరీ హీరోయిన్‌ శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని, కెరీర్‌ తొలినాళ్లలో ఆమె తననెంతో ప్రోత్సహించారన్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌  హీరోయిన్‌ గా పరిచయం అవుతున్న ‘దడక్‌’ సినిమాకు కొరియోగ్రఫీ చేస్తున్న ఫరా, జాన్వీ కూడా మంచి డాన్సర్‌ అని ప్రశంసలు కురిపించారు. అయితే ఇంకా జాన్వీ నేర్చుకునే దశలోనే ఉందదని.. ఇప్పుడే ఆమెను శ్రీదేవితో  పోల్చడం సరైంది కాదన్నారు.

మై హూనా సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఫరాఖాన్‌.. కొంత కాలంగా దర్శకత‍్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. ఈ మీడియా సమావేశంలో తన భవిష్యత్‌ ప్రణాళిక గురించి మాట్లాడుతూ రొటీన్‌ సినిమాలతో విసిగెత్తిపోయాను. స్టైల్‌ మార్చి ఈసారి బిగ్‌ బడ్జెట్‌ యాక్షన్‌ మూవీ చేయాలనుకుంటున్నాను తన మనసులో మాట బయటపెట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement