కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు | All India OBC Association Backs Minister Konda Surekha, Condemns Action And Warns Congress Leadership, More Details Inside | Sakshi
Sakshi News home page

కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు

Aug 23 2026 4:18 PM | Updated on Aug 23 2026 6:06 PM

All India OBC Association Backs Minister Konda Surekha

హైదరాబాద్‌:  తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు ప్రకటించింది  కొండా సురేఖకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. కొండా సురేఖ బీసీ మంత్రి కాబట్టే కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఓబీసీ సంఘం విమర్శించింది. కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా నోటీసులిచ్చారని మండిపడింది.  

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిలు వ్యతిరేకంగా మాట్లాడినా నోటీసులు ఇవ్వలేదని, అదే కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన దానికి మాత్రం నోటీసులిచ్చారని  ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కొండా సురేఖకు అన్యాయం జరిగితే మాత్రం రాహుల్‌ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్‌లో కొందరు చెంచాలున్నారని, అందుకే ఈ తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని దుయ్యబట్టింది. 

కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తాం
కావాలనే కొందరు తనను టార్గెట్‌ చేశరని, కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా కావాలనే కొంతమంది నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ మరో లేఖ రాసింది. దీనిపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ మల్లు రవి స్పందిస్తూ.. కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తామన్నారు. తెరవెనుక ఎవరున్నారనేది చెప్పాల్సిన అవసరం లేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ఇదీ చదవండి: 
కొండా సురేఖ ఎపిసోడ్‌పై టీపీసీసీ చీఫ్‌ రియాక్షన్‌

కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్‌ సిద్ధం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement