రాజకీయ కారణాలతోనే.. అమెరికా పర్యటన రద్దుపై రేవంత్ స్పందన | Revanth Reddy responds to the cancellation of permission for his US visit | Sakshi
Sakshi News home page

రాజకీయ కారణాలతోనే.. అమెరికా పర్యటన రద్దుపై రేవంత్ స్పందన

Aug 23 2026 3:46 PM | Updated on Aug 23 2026 3:47 PM

Revanth Reddy responds to the cancellation of permission for his US visit

లండన్‌: రాజకీయ కారణాలతో  కేంద్రం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణకు సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడతానని తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాలపై ఈ రోజు (ఆదివారం)  క్లుప్తంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనకు మద్దతు తెలిపిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర  కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

లండన్‌లో  తన సమావేశాలు, కార్యక్రమాలు పూర్తయ్యాయని  గత మూడు రోజులుగా తనకు లభించిన అపూర్వమైన మద్దతుకు ఈ సందర్భంగా  కృతజ్ఞతలు తెలిపారు. సీఎం మునుపటి షెడ్యూల్ ప్రకారం లండన్ నుంచి అమెరికా బోస్టన్ వెళ్లాల్సి ఉంది. అయితే కేంద్రం తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో రేవంత్‌ ఈ రోజు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement