డాలర్లు వస్తున్నాయ్‌.. జాగ్రత్త! | Robert Kiyosaki Warns Fake Dollars US QE Inflation | Sakshi
Sakshi News home page

డాలర్లు వస్తున్నాయ్‌.. జాగ్రత్త!

Aug 23 2026 2:13 PM | Updated on Aug 23 2026 2:13 PM

Robert Kiyosaki Warns Fake Dollars US QE Inflation

అమెరికా మరోసారి క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (QE) పేరుతో డాలర్లను ముద్రించేందుకు సిద్ధమవుతోందని ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత రాబర్ట్‌ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ (X) ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. అమెరికా ట్రెజరీ తీసుకునే ఇలాంటి చర్యలతో డాలర్‌ కొనుగోలు శక్తిని సూచించే డీఎక్స్‌వై (DXY) సూచీ పడిపోతుందని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

డాలర్లలో పొదుపు చేసుకునే వారే అధికంగా నష్టపోతారని కియోసాకి హెచ్చరించారు. ఆర్థికంగా అవగాహన ఉన్న పెట్టుబడిదారులు విలువ పెరిగే బంగారం, వెండి, బిట్‌కాయిన్‌, కొంత రియల్‌ ఎస్టేట్‌ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకుంటారని చెప్పారు. ఆర్థిక పరిజ్ఞానం లేని వారు విలువ కోల్పోయే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్‌

‘ఆర్థిక విద్య ఖరీదైనదని మీరు భావిస్తే.. ఆర్థిక అజ్ఞానానికి చెల్లించే మూల్యం ఎంత?’ అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కియోసాకి గుర్తుచేశారు. ఆర్థిక విద్య కోసం వెచ్చించే సమయం, డబ్బు కంటే.. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల సంపాదించలేని డబ్బే అతిపెద్ద ఖర్చు అని తన ‘రిచ్‌ డాడ్‌’ చెప్పేవారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement