కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్‌ సిద్ధం | Growing Party Backlash Against Minister Konda Surekha | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్‌ సిద్ధం

Aug 21 2026 5:39 PM | Updated on Aug 21 2026 5:48 PM

Growing Party Backlash Against Minister Konda Surekha

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సురేఖపై కాంగ్రెస్‌ పార్టీ చర్యలకు సిద్ధమైంది. మరోసారి నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా నేతలు నిన్న తీర్మానం చేశారు. కొండా సురేఖను భర్తరఫ్ చేయాలని శుక్రవారం సీఎం, పీసీసీ, హైకమాండ్‌కు 20 మంది ఎమ్మెల్యే లు లేఖ రాశారు. మరోసారి నోటీసులు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ  సిద్ధమైంది.

ఇప్పటికే కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఓ సారి నోటీసులు జారీ చేసింది. ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పింది. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి.

తాను త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని కొండా సురేఖ అంటున్నారు. పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, రేవంత్ రెడ్డిపైనే తాను టార్గెట్ చేశానని కొండా సుస్మిత తెలిపారు. టికెట్ ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని సుస్మిత ప్రశ్నించారు.

ఇదీ చదవండి: మాట్లాడతా అన్ని విషయాలూ చెబుతా: కొండా సురేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement