న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం భూముల వేలంపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. భూముల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది.
కాగా, రాయదుర్గం భూముల వేలాన్ని అడ్డుకోలేమని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఆ భూముల వేలానికి సంబంధించి బిడ్లు ఇప్పటివరకు అందలేదని, దీంతో కొన్ని రోజులు వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే, అందుకు హైకోర్టు నిరాకరించింది.
భూ సంస్కరణల ట్రిబ్యునల్ ఎదుట ఎటువంటి విచారణ లేదా పునర్వి చారణ ప్రక్రియ పెండింగ్‌లో లేనప్పుడు మధ్యంతర ఉత్తర్వులతో సర్కారు నిర్ణయాన్ని ఆపలేమని స్పష్టం చేసింది. సర్వే నంబర్ 83లో 11.12 ఎకరాల భూ వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 27కు హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 24 గంటల్లో ‘జంతర్ మంతర్ 2.0’.. సీజేపీ హెచ్చరిక


