జైపూర్, రాజస్థాన్: స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలలను బాగు చేయండి) ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రాజస్థాన్‌లో చేపట్టిన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు దాడిచేయడంపై సీజేపీ స్పందించింది. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, ఇతరులపై అమానుషంగా దాడిచేయడాన్ని,వాహనాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. తమపై ఎటాక్ చేసిన దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని రాజస్థాన్ పోలీసులను డిమాండ్ చేసింది. లేదంటే 24 గంటల తర్వాత రాజస్థాన్‌లో 'జంతర్ మంతర్ 2.0' ప్రారంభమవుతుంది; ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని హెచ్చరించింది. అయితే ఈ విషయంలో గ్రామస్తులను మాత్రం వేధించకూడదని స్పష్టం చేసింది. ఇందులో గ్రామస్తుల ప్రమేయం ఏమీ లేదనీ వెల్లడించింది.
మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. గ్రామ పాఠశాలను సందర్శించిన సందర్భంగా జరిగిన ఘర్షణ వాతావరణంపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ స్పందిస్తూ , "ప్రజలు, యువత , విద్యార్థులలో ఆగ్రహం ఉంది. ప్రభుత్వం దానిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించడం, ఫోటోలు తీయడం లేదా నివేదికలు ప్రచురించడం వంటివి చేయరాదని జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తప్పబట్టారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలను జారీ చేయడం సరైనది కాదన్నారు. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న పరిస్థితిని, సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టడానికి బదులుగా, ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి చేటున్నారు. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించకుండా లేదా ఫోటోలు తీయకుండా ప్రజలను అడ్డుకోలేరన్నారు. వాస్తవానికి, ప్రభుత్వం వార్తలను అణచివేయడానికి , ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
<
राजस्थान पुलिस को 24 घंटों का समय दिया गया है इन गुंडों को गिरफ्तार करें,
बिना गांव वालो को परेशान किए इसमें गांव वालो का कोई योगदान नहीं है
24 घंटे निकलने के बाद राजस्थान में शुरू होगा जंतर मंतर 2.0 , जो आगे होगा उसकी जिम्मेदार हम नहीं होंगे@Cockroachisback#schoolThikKaro pic.twitter.com/kRyFncu9Sj— Cockroach Janta party (@IAMVICKYFANS) August 21, 2026
కాగా సీజేపీ ప్రచారంలో భాగంగా జయపూర్ జిల్లాలోని బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాంపురా కన్వర్‌పురా గ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేయడానికి వచ్చిన కార్యకర్తలను గ్రామస్తులు, సీజేపీ బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. సీజేపీ బృందం రాకముందే గ్రామస్తులు ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం సీజేపీ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీజేపీ కార్యకర్తలను గ్రామంలోనికి రానీయకుండా అడ్డుకుని, అక్కడినుంచి పంపించివేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.
గతంలో సీజేపీ నిర్వహించిన తనిఖీల నేపథ్యంలో, రాజస్థాన్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు మరియు మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంపై సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని దాచి పెట్టేందుకే విద్యాశాఖ మంత్రి ఇలాంటి ఆంక్షలు విధిసస్తోందని, తమ ప్రచారం ఆగదని పేర్కొన్నారు. 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు.
#WATCH | Attack on Cockroach Janta Party (CJP) team in Jaipur village | Jaipur, Rajasthan: Congress MLA Sachin Pilot says, "State Govt has issued a fresh order that no journalist can enter a school, no photos can be taken, and nothing can be reported. They want to keep their… pic.twitter.com/Q4NTYATzVe
— ANI (@ANI) August 21, 2026
ప్రస్తుతం ఈ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారి మూతపడటంతో, సమీపంలోని పశువుల కొట్టంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, స్థానిక ప్రయత్నాలతోనే పాఠశాలను బాగు చేసుకోవచ్చని గ్రామస్తులు, భాజపా కార్యకర్తలు తెలిపారు. అనంతరం వారు పాఠశాల వెలుపల ధర్నా చేపట్టి నినాదాలు చేశారు.
సీజేపీ కార్యకర్త శివాంగి శర్మ మాట్లాడుతూ, "మమ్మల్ని ఉగ్రవాదులని, నక్సల్స్ అని అంటూ మా కార్యకర్తలపై దాడి చేశారు. ఈ బయటివాళ్ళు... లోపలివాళ్ళు... ఏంటిది... ఇది ఒకే దేశం. మేము ఏ పార్టీ నుంచో గానీ, మరో దేశం నుంచో గానీ రాలేదు. మేము మన సొంత దేశపు బిడ్డల గురించి మాట్లాడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు తాము బీజేపీ కార్యక్తలం కాదని, సీజేపీ కార్యకర్తలే తమ కార్లను ధ్వంసంచేసుసుకున్నారని తెలిపారు. తమ పాఠశాలను బాగు చేసుకునే పనులను ఇప్పటికే ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఈ ఘటన గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని బగ్రూ డీఎస్పీ ధర్మేంద్ర శర్మ తెలిపారు.


