మాట్లాడతా.. అన్ని విషయాలు చెబుతా: కొండా సురేఖ | Konda Surekha Responds To Notice On Sushmita Comments | Sakshi
Sakshi News home page

మాట్లాడతా.. అన్ని విషయాలు చెబుతా: కొండా సురేఖ

Aug 21 2026 4:42 PM | Updated on Aug 21 2026 5:42 PM

Konda Surekha Responds To Notice On Sushmita Comments

హైదరాబాద్‌: త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. తన నివాసంలో శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆమె పాల్గొన్నారు. తమ ఇంట్లో జరిగిన పూజలో బిజీగా ఉన్నానని తెలిపారు. నిన్ననే అన్ని విషయాలు మాట్లాడానని, చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పానని అన్నారు. ఇంకా తాను చెప్పేది ఏమి లేదని తెలిపారు.

కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు. అప్పటి వరకు ఇంకేమి మాట్లాడనని చెప్పారు. త్వరలో అన్ని విషయాలు తప్పకుండ మాట్లాడతానని వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా సుస్మిత స్పందిస్తూ.. పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, రేవంత్ రెడ్డినే తాను టార్గెట్ చేశానని కొండా సుష్మిత స్పష్టం చేశారు. 

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, మీనాక్షితో పాటు అందరిపైనా తనకు అపార గౌరవం ఉందన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం తెలంగాణలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన సుస్మిత, టికెట్ ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement