సాక్షి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న సిరి ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.వికారాబాద్‌కు చెందిన ఆ యువతి ప్రైవేట్ ఉద్యోగం కోసం ఈ నెలలోనే సంగారెడ్డికి వచ్చింది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ.. హాస్టల్‌లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే యువతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు త్వరలో పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.


