TG: ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలం | TG Auto Unions Call Off Strike After Successful Talks With Government | Sakshi
Sakshi News home page

TG: ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలం

Aug 23 2026 9:44 PM | Updated on Aug 23 2026 9:46 PM

TG Auto Unions Call Off Strike After Successful Talks With Government

హైదరాబాద్‌: ఆటో కార్మిక సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆటో కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ అర్థరాత్రి నుంచి తలపెట్టాలనుకున్న సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. 

ఆటో కార్మిక సంఘాలు ఆటోల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దీనిలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో కార్మిక సంఘాలు తమ బంద్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఫలితంగా ఆటో కార్మికులు యధావిధిగానే సేవలు అందించనున్నారు.

భవనం కూలిన ఘటన.. ఇతర ప్రమాదకర భవనాల కూల్చివేతలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement