తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ‘చెత్త’ పంచాయితీ.. | Malgi Villagers Protest At Telangana Bidar Border | Sakshi
Sakshi News home page

తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ‘చెత్త’ పంచాయితీ..

Jul 1 2026 10:46 AM | Updated on Jul 1 2026 11:34 AM

Malgi Villagers Protest At Telangana Bidar Border

సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీదర్ మున్సిపల్ చెత్తను గత 15 రోజులుగా తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో బీదర్‌, మల్గి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

వివరాల మేరకు.. బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డు తమ గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో మల్గి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో చెత్తను అక్కడ పడేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త డంపింగ్‌ కారణంగా తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.

మరోవైపు.. చెత్త వాహనాలను అడ్డుకున్న వారిని బీదర్ మున్సిపల్ అధికారుల బెదిరిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు బీదర్‌కి ఎలా వస్తారో చూస్తాం అంటూ మల్గి, బీదర్ రోడ్డుపై 40 వాహనాల చెత్తను మున్సిపల్ అధికారులు పారబోసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. బీదర్, మల్గి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement