రాంచీలో బాహాబాహీ | Jharkhand protesters attempt to burn effigies of CM Hemant Soren, Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాంచీలో బాహాబాహీ

Aug 22 2026 6:29 AM | Updated on Aug 22 2026 6:29 AM

Jharkhand protesters attempt to burn effigies of CM Hemant Soren, Rahul Gandhi

సీఎం సోరెన్, రాహుల్‌ దిష్టిబొమ్మల దహనానికి విద్యార్థుల యత్నం

రాంచీ: ఎంపిక పరీక్షల్లో అవకతవకలపై శుక్రవారం జార్ఖండ్‌ రాజధాని రాంచీలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీఎం హేమంత్‌ సోరెన్, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు తలపడ్డాయి. విద్యా ర్థుల నిరాహార దీక్షలు, తీవ్ర ఆందోళనల నడు మ జార్ఖండ్‌ పబిŠల్క్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం సోరెన్‌ ప్రకటించగా, అందుకు సంబంధించిన ఆదేశాలపై గురువారం స్టే విధించింది. 

రాష్ట్ర ప్రభుత్వం తన చర్యను సరైన రీతిలో సమర్థించుకోకపోవడమే హైకోర్టు ఆదేశాలకు కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు జేపీ ఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ రిఫామ్స్‌ మంచ్‌ సారథ్యంలో ర్యాలీగా నగరంలోని ఆల్బర్ట్‌ చౌక్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోరెన్, రాహుల్‌ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు, అధికార జేఎంఎం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణకు దారి తీసింది. 

విద్యార్థులు ముందుగా అనుమతించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ర్యాలీ చేపట్టడంతోపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని పోలీసులు ఆరోపించారు. ఈ సమయంలో మంచ్‌ నేత కునాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్పృహతప్పి పడిపోవడంతో సదర్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేశారని మరో నేత పియూశ్‌ కుమార్‌సింగ్‌ చెప్పారు. పోలీసులు విద్యార్థినులపైనా బలప్రయోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. హజారీబాగ్, గిరిదిహ్‌లోనూ విద్యార్థులు సీఎం సోరెన్‌ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు యత్నించడం, జేఎంఎం కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణలకు దారి తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement