స్విస్‌తో ‘పంచ’తంత్రం  | PM Narendra Modi meets Swiss president Parmelin in Delhi | Sakshi
Sakshi News home page

స్విస్‌తో ‘పంచ’తంత్రం 

Oct 6 2026 5:38 AM | Updated on Oct 6 2026 5:38 AM

PM Narendra Modi meets Swiss president Parmelin in Delhi

ఐదు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్, స్విట్జర్లాండ్‌ 

సమున్నత స్థాయికి ద్వైపాక్షిక సంబంధాలు

స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు పార్మెలిన్‌తో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా భారత్‌ ఐదు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. తద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గై పార్మెలిన్‌ సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

వాణిజ్యం మొదలు పెట్టుబడుల దాకా పలు అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపి ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలుచేశారు. సమానత్వ సూత్రాలను గౌరవిస్తూ వలసలు, రాకపోకల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం కోసం ఒప్పందం చేసుకున్నారు. అక్రమ వలసలు, మానవుల శ్రమ దోపిడీ, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఈ మొబిలిటీ, మైగ్రేషన్‌ ఒప్పందంలోభాగంగా పర్యటించినప్పుడల్లా గరిష్టంగా ఆరు నెలలు సందర్శనకాలం ఉండేలా ఐదేళ్లపాటు పలు మార్లు అనుమతించే మల్టీపుల్‌ ఎంట్రీ వీసాలను అందజేయనున్నారు. ఇరు దేశాల యువ నిపుణులు తమ రంగాల్లో తాత్కాలిక ఉపాధిని పొందుతూ వృత్తిపరమైన, భాషా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు అవకాశం కల్పిస్తూ యంగ్‌ ప్రొఫెషనల్స్‌ ఎక్సే్ఛంజ్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పదం ప్రకారం ఇరుదేశాలు ఏటా 300 మంది నిపుణుల పరస్పర పర్యటనలకు అవకాశం కల్పిస్తారు.

రవాణా, ఎలక్ట్రిక్‌ వాహనాలు, పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల్లో సాంకేతికతలను, మౌలిక వసతుల పరస్పర సహకారం, ప్రోత్సాహం కోసం మరో ఒప్పందం చేసుకున్నారు. భారత్, స్విట్జర్లాండ్‌ పరిశోధనా రంగాల్లో దీర్ఘకాలిక సహకారం, శాస్త్రీయ పరిశోధనల్లో పరస్పర ప్రోత్సాహం లక్ష్యంగా మరో ఒప్పందం చేసుకున్నారు. కృత్రిమమేధ ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ అంశాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత పెంపొందటం కోసం మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. 

భారతీయ ఉత్పత్తులకు స్విస్‌లో సింహద్వారం 
‘‘భారతీయ ఎగుమతులకు స్విస్‌ విపణిలో మరింత అవకాశాలు మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. రెండు దేశాల మధ్య ఉమ్మడి పెట్టుబడుల వరద పారనుంది. యూరప్‌లో భారత్‌కు స్విట్జర్లాండ్‌ ప్రధాన భాగస్వామి. ఇంజనీరింగ్, సేవలు, కీలక పరికరాలు, రసాయనాలు, ఫార్మ ఇలా కీలక రంగాల్లో 330కిపైగా స్విస్‌ కంపెనీలు ఇప్పుడు భారత్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. అటు స్విస్‌లోనూ భారత ఐటీ, ఫార్మా, మెషినరీల కంపెనీలు విస్తరిస్తున్నాయి’’అని మోదీ చెప్పారు. 

యూరోపియన్‌ స్వేచ్ఛా వాణిజ్య సంఘం(ఈఎఫ్‌టీఏ)లో భాగస్వాములైన ఐస్‌ల్యాండ్, లీచెస్టైన్, నార్వే, స్విస్‌ మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(టీఈపీఏ) ఈ నెల నుంచి అమల్లోకి వచి్చన వేళ స్విస్‌లో విడిగా ఐదు కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. టీఈపీఏ అనేది పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి, ఉమ్మడి శ్రేయస్సుకు సాధనకు బలమైన బ్లూప్రింట్‌లా పనిచేస్తోంది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో భారత్‌ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను, పది లక్షల నూతన ఉద్యోగాలను ఆశిస్తోంది అని మోదీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement