బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు | 25 Years Old Youth Died Of Heart Attack While Riding On His Bike In Madhya Pradesh - Sakshi
Sakshi News home page

Madhya Pradesh: బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు

Feb 19 2024 12:42 PM | Updated on Feb 19 2024 1:18 PM

Heart Attack Case on Bike - Sakshi

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న యువకునికి గుండెపోటు వచ్చి, బైక్‌పై పైనుంచి కింద పడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇండోర్‌ పరిధిలోని ముసాఖేడీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి చెందిన రాహుల్ రైక్వార్‌కు బైక్‌పై వెళుతుండగా గుండెపోటు వచ్చినట్లు ఆజాద్ నగర్ పోలీసులు తెలిపారు. రాహుల్ వయసు 26 ఏళ్లు. రాహుల్ తన తమ్మునితో కలిసి ఏదో పనిమీద బైక్‌మీద బయలు దేరాడు. బైక్‌పై వెనుక రాహుల్ కూర్చోగా, అతని తమ్ముడు బైక్ నడుపుతున్నాడు. దారిలో రాహుల్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. దీనిని గమనించిన అతని తమ్ముడు చుట్టుపక్కలవారి సాయంతో  వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 

బాధితుని పరీక్షించిన వైద్యులు  అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా మృతుడు రాహుల్‌కు ఏడాదిన్నర కుమార్తె ఉంది. కాగా చిన్నవయసులో గుండెపోటుకు  క్రమరహిత దినచర్య, అనారోగ్యకర ఆహారం, జంక్ ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement