
రాయ్‌పూర్: ప్రియుడికి బైక్ కొనివ్వడానికి ప్రియురాలు దొంగగా మారిపోయింది. బంధువుల ఇంటిని దోచేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కాంకేర్ జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రియుడు విశ్వకర్శకు బైక్ కొనివ్వడానికి ప్రియురాలు కరుణ పటేల్ పక్కా ప్లాన్ చేసింది. తాళం వేసి ఉన్న బంధువుల ఇంటికి ప్రియుడిని తీసుకెళ్లి రూ.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.95 వేలు నగదును చోరి చేసింది. ఇంటి యాజమాని కన్హయ్య పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రియుడు, ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాంకేర్ జిల్లా జైలుకు తరలించి విచారణ చేశారు. విచారణలో కరుణ పటేల్ అసలు విషయం బయటపెట్టింది. ప్రియుడికి బైక్ కొనడం కోసమే ఈ పనిచేసినట్లు ప్రియురాలు చెప్పింది. బైక్ కోసం తన ప్రియుడికి డబ్బు ఇచ్చి, ఆభరణాలను తన వద్దే ఉంచుకున్నట్లు పోలీసులకు తెలిపింది.
కన్హయ్య పటేల్ సోమవారం మధ్యాహ్నం పని కోసం మార్కెట్‌కు వెళ్లగా.. ఆ రాత్రి తిరిగి వచ్చిన తర్వాత, అతని ఇంటి తాళం పగలగొట్టి, గదులు దోచుకున్నారని. అదనపు ఎస్పీ దినేష్ సిన్హా మీడియాకు తెలిపారు.