
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. కొండచరియలు ఒక్కసారిగా విరిగి పడ్డాయి. ఈ సమయంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులపై రాళ్లు పడ్డాయి. దీంతో ఆ బైక్‌తో పాటు వారు కిందపడిపోయారు. ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి.. వాళ్లను ఆ శిథిలాల నుంచి బయటకు లాగేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

కాగా, ధరాలీ గ్రామంపై వరద విలయం కరాళ నృత్యంచేసింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద వరద ఆ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలను భూస్థాపితం చేసింది. అప్పటిదాకా ప్రకృతి అందాలతో తులతూగిన ఉత్తరాఖండ్‌లోని ఆ గ్రామం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల వరద నీరు, బురద ముంచెత్తిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ఉత్తరకాశీ జిల్లా మేజి్రస్టేట్ ప్రశాంత్ ఆర్య చెప్పారు. 50 మందికిపైగా జనం జాడ గల్లంతైందని స్థానికులు చెబుతున్నారు.
Uttarakhand: Three youths on a bike narrowly escaped disaster as landslide debris fell over them in Haridwar. #Uttarakhand #UttarakhandNews pic.twitter.com/4gMHwbG25i
— Siddharth (@Siddharth_00001) August 6, 2025
జాతీయ భద్రత, నిఘా కార్యక్రమంలో భాగంగా సమీప హార్సిల్ లోయ ప్రాంతంలో ఏర్పాటుచేసిన భారత ఆర్మీ 14 రాజ్‌రిఫ్ యూనిట్ బేస్‌క్యాంప్‌పైనా బురద దూసుకొచ్చింది. దీంతో 10 మంది జవాన్లు, ఒక సైన్యాధికారి(జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్) జాడ సైతం గల్లంతైంది. తోటి జవాన్ల జాడ తెలీకుండాపోయినాసరే సడలని ధైర్యంతో ఇతర జవాన్లు సహాయక, అన్వేషణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నలుగురు చిన్నారులు, 11 మంది మహిళలు, 22 మంది పురుషులను ఘటనాస్థలి నుంచి సహాయక బృందాలు కాపాడాయి.
హరిశీలా పర్వతం సమీపంలోని సత్‌తాల్ దగ్గరి కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా పెరిగిన ఖీర్‌గంగా నదీప్రవాహం హద్దులు దాటి దిగువక దూసుకొచ్చింది. ఈ వరదనీటితో పాటు వరద దిగువకు గంటకు 43 కిలోమీటర్ల వేగంతో కొట్టుకొచ్చి అక్కడ ఉన్న ధరాలీ గ్రామాన్ని ముంచెత్తి వినాశనం సృష్టించింది. ప్రకృతి ప్రకోపం వార్త తెల్సి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగి్నమాపక దళం, ఉత్తరాఖండ్ పోలీసులు, భారత ఆర్మీ బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలూ ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.