 
													మన గతంలో చాలామంది సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీల గురించి తెలుసుకున్నాం. వీరిలో చాలామంది ఆదాయంలో ఖర్చుకంటే పొదుపునకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విలాసాలకు పోకుండా, సాధారణ జీవితాన్ని గడుపుతూనే ఎన్నో ఉన్నత శిఖరాల నధి రోహించిన వారి జర్నీల గురించి విన్నాం. ఈ లిస్ట్‌లో తాజాగా వీసీ మీడియా కోఫౌండర్, కంటెంట్ స్పెషలిస్ట్ సుశ్రుత్ మిశ్రా చేరారు.
డబ్బును ఎప్పుడు, ఎక్కడ,ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడమే తెలివైన వ్యాపారవేత్త లక్షణం.ఎంత డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యంకాదు. ఎంత పొదుపు చేయగలిగాం, పెట్టుబడి ద్వారా ఎంత రిటర్న్స్ సాధించాం అనేది ముఖ్యం. ఈ క్రమంలో సుశ్రుత్ మిశ్రా ట్వీట్ వైరల్‌గా మారింది. 1.7 మిలియన్ల వ్యూస్‌ను, 12.8 వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. (ఒకప్పుడు రెస్టారెంట్‌లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో)
నెలకు 1.5 లక్షలకు పైగా సంపాదించే 23 ఏళ్ల సుశ్రుత్ మిశ్రా తనకు యాపిల్ ఐఫోన్ గానీ, కారుకానీ, కనీసం బైక్ కూడా లేదని ట్వీట్ చేశాడు. ఈ విలాసాలకంటే రిటైర్ అయిన తల్లిదండ్రులు ఆనందంగా గడిపేలా చూడటం, బిల్లులు చెల్లింపులు, భవిష్యత్తు ఎదుగుదల ప్రణాళికలే ఇందుకు కారణమని మిశ్రా చెప్పుకొచ్చాడు. కొడుకుగా అమ్మనాన్నల బాధ్యత అని తెలిపారు. దీన్ని అందరికీ తెలిసేలా గ్లామరైజ్ చేయాలనుకున్నా అంటూ ట్వీట్ చేశాడు.
సుశ్రుత్ మిశ్రా లైఫ్ స్టైల్ చాలామందకి ప్రేరణగా నిలిచింది. ఇది ఇండియా స్టోరీ. 2011లో రూ. 35 వేల జీతం ఉన్నపుడు తాను కూడా ఇలాగే చేశానని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. (లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!)
తనకూ పైబాధ్యతలన్నీ ఉన్నాయి..కుటుంబ ఖర్చులు, చెల్లెలి చదువు భవిష్యత్తు పెట్టుబడులు. అమ్మ మందులు, సొంత ఇంటి కోసం పొదుపు, కొన్ని ఇతర ఖర్చులు ఇవన్నీ నా కోరికల కంటే మించినవి..కానీ బైక్, ఐఫోన్‌ను సొంతం చేసుకోవడం మీకెందుకు అడ్డంకిగా ఉన్నాయి? అని మరొక వినియోగదారు కమెంట్ చేశారు. కాగా కంటెంట్, మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని సుశ్రుత్ మిశ్రా, రోషన్ శర్మ కలిసి స్థాపించారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!)
I'm a 23yo with ₹1.5 lakh+ monthly income. Yet:
— Sushrut Mishra (@SushrutKM) June 9, 2023
- I don't own any 'Apple'
- I don't live on my own
- I don't have a bike/car
Why?
Responsibilities of an Indian son who:
- Retired his parents
- Pays all the bills
- Plans for his family's future
I want to glamourize this.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
