Meet HubSpot Ceo Yamini Rangan's Inspiring Journey and Net Worth - Sakshi
Sakshi News home page

ఒకప్పుడు రెస్టారెంట్‌లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్‌ కంపెనీ సీఈవో

Published Sat, Jun 10 2023 6:02 PM

Meet HubSpot Ceo Yamini Rangan inspiring journeyand Net Worth - Sakshi

పట్టుదలకు మారు పేరు ఆమె. విజయానికి కేరాఫ్‌ ఎడ్రస్‌ భారత సంతతికి చెందిన యామిని రంగన్. రెస్టారెంట్‌లో సర్వర్‌గా కరియర్‌ను ప్రారంభించిన యామిని ఈరోజు రూ. 2.11లక్షల కోట్లకు పైగా విలువైన కంపెనీగా సీఈవోగా సేవలందిస్తున్నారు. ఈఏడాది టాప్‌ 100 టెక్‌ మహిళల్లో చోటు సంపాదించుకున్నారు. యామిని రంగన్ యుఎస్‌లోని అతిపిన్న వయస్కురాలైన అత్యుత్తమ వ్యాపార కార్య నిర్వాహకులలో ఒకరు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే లక్ష్యంతో తక్కువ కాలంలోనే ఆమె ఎన్నో పేరు ప్రఖ్యాతులు, సంపదను కూడబెట్టుకున్నారు. ఆమె అద్భుతమైన సక్సెస్ స్టోరీ.. నెట్ వర్త్  గురించి తెలుసుకుందాం. 

టెక్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన సీఈవీల్లో ఒకరుగా ఉన్నారు యామిని. భారతదేశంలోని  కుగ్రామంనుంచి వచ్చి పిన్న వయసులో  గ్లాస్‌ సీలింగ్‌ను  బ్రేక్‌ చేసి తానేంటో నిరూపించుకుంది.  మల్టీ బిలియన్ డాలర్ల టెక్ కంపెనీకి నాయకత్వం వహించే కొద్దిమంది మహిళల్లో ఒకరుగా పేరు తెచ్చుకోవడం విశేషం. (వరుణ్‌ లావణ్య ఎంగేజ్‌మెంట్‌: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్‌ ఖరీదెంతో తెలుసా?)

హబ్‌స్పాట్‌ కంపెనీలో చేరి రెండేళ్లు పూర్తి కాకముందే  సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆమెది. జనవరి 2020 నుండి ఆగస్టు 2021 వరకు చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా, సెప్టెంబర్ 2021 నుండి ఇప్పటి వరకు సీఈవోగా సేవలందిస్తున్నారు. 25.66 బిలియన్ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో కంపెనీ దిన దినాభివృద్ది చెందుతోంది. 2023లో యామినీ రంగన్ నికర విలువ దాదాపు 32 మిలియన్‌ డాలర్లు.

21 ఏళ్ల వయస్సులో, చాలా పరిమితమైన నగదుతో  యామిని ఇండియా వదిలి భయం భయంగా అమెరికాకు పయనమైంది. జీవితం అంత సులభం  కాదని ఆమె వెంటనే గ్రహించింది. యూఎస్‌లో జీవించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో యామిని అద్దె చెల్లించిన తర్వాత ఆమె జేబులో మిగిలింది. కేవలం  150  డాలర్లు మాత్రమే. దీంతో ఉద్యోగం సంపాదించడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది.

అలా అట్లాంటాలోని ఫుట్‌బాల్ స్టేడియం రెస్టారెంట్‌లో ఫుడ్‌, డ్రింక్స్‌ అందించడం తొలి ఉద్యోగమని యామిని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తానెప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాననీ, అందుకే తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లి డబ్బు అడగడానికి ఇష్టపడ లేదని చెప్పారు. యామిని యూఎస్‌లో మాస్టర్స్ చేయడానికి ముందు కోయంబత్తూరులో బీటెక్‌, తరువాత బెర్కిలీ నుంచి ఎంబీఏ పట్టా  పుచ్చుకుంది. (డిజిటల్‌ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్‌: విశేషం ఏమిటంటే!)

సుదీర్ఘ కెరీర్‌లో సాప్‌, లూసెంట్, వర్క్‌డే, డ్రాప్‌బాక్స్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల్లో నిచేశారు. 2019లో శాన్ ఫ్రాన్సిస్కోలో వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా ప్రశంసలందుకున్నారు. ఇద్దరు అబ్బాయిలకు తల్లినని తన ట్విటర్‌ బయోలో రాసుకున్నారు యామిని.

Advertisement

తప్పక చదవండి

Advertisement