
ఆసుస్ ఇండియా ప్రముఖ పాడ్‌కాస్టర్ రాజ్ షమానీని ఎక్స్‌ఫర్ట్‌బుక్ సిరీస్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. 18 మిలియన్లకు పైగా వివిధ ప్లాట్‌ఫామ్‌ల్లో రాజ్‌కు సబ్‌స్క్రైబర్‌లున్నారు. ‘ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ’ అనే పాడ్‌కాస్ట్ ద్వారా విస్తృతంగా ఫాలోయింగ్‌ను సంపాదించారు. ఆసుస్ ఇండియాలో కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి రాజ్ షమానీ కీలకంగా వ్యవహరిస్తారని కంపెనీ నమ్ముతుంది.
ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’
ఈ సందర్భంగా ఆసుస్ ఇండియా, శ్రీలంక, నేపాల్ కమర్షియల్ పీసీ, స్మార్ట్‌ఫోన్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ శర్మ మాట్లాడుతూ.. ‘ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ సిరీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాజ్ షమానీని స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎక్స్‌పర్ట్‌బుక్ సిరీస్ ద్వారా కంపెనీ భారతీయ నిపుణులకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించింది’ అన్నారు. రాజ్ షమానీ మాట్లాడుతూ..‘ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ యువ సృష్టికర్తల కోసం, కంపెనీల వ్యవస్థాపకులు లేదా భవిష్యత్ వ్యాపార నాయకుల కోసం తయారు చేశారు. ఆసుస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది’ అన్నారు.