న్యూఢిల్లీ: నటి కీర్తి సురేష్ యునిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ ప్రచారకర్తగా నియమితులయ్యారు. పిల్లల మానసిక ఆరోగ్యం, హక్కుల గురించి ఆమె పనిచేయనున్నారని యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ ఆదివారం ప్రకటించారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో భాగం పంచుకోనున్నారు. తన కొత్త బాధ్యతల పట్ల కీర్తి సురేష్ హర్షం వ్యక్తం చేశారు.
ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ‘పిల్లలు శ్రేయస్సు మన బాధ్యత. మన పెంపకం, ప్రేమపూర్వక సంరక్షణ వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి పునాది వేస్తుంది. మరింత ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి తోడ్పడుతుంది. వారి నేపథ్యం, సామర్థ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి అభివృద్ధికి సమాజంలో అవగాహనకు యునిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం నాకు గౌరవంగా ఉంది’అని ఆమె ప్రకటించారు.


