
రాఖీ, జన్మాష్టమి తదితర పండుగల సందర్భంగా ట్రావెల్ మెగా ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నట్లు పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా విమాన సర్వీసుల్లో 12%, అంతర్జాతీయ రూట్లలో 10%, బస్ బుకింగ్స్‌పై 20 % డిస్కౌంటు పొందవచ్చు.
అలాగే యూపీఐ ద్వారా రైలు బుకింగ్స్‌కి పేమెంట్ గేట్‌వే చార్జీలు ఉండవు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డుదారులు ప్రత్యేక రాయితీలు పొందవచ్చు. పేటీఎం ద్వారా బుక్ చేసుకున్న రైలు టికెట్లను రద్దు చేసుకుంటే 100% తక్షణ రీఫండ్‌తో, ఉచిత క్యాన్సిలేషన్ అవకాశాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. జూలై 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది.